బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Mar 19, 2020 , 00:51:05

చమురు వదులుతున్నది..

చమురు వదులుతున్నది..

  • 18 ఏండ్ల కనిష్ఠానికి క్రూడ్‌  
  • 25 డాలర్లకు బ్యారెల్‌ ధర

లండన్‌, మార్చి 18: కరోనా సెగ చమురు ధరలకు గట్టిగానే తాకుతున్నది. వరుసగా మూడోరోజు ధరలు భారీగా తగ్గడంతో 18 ఏండ్ల కనిష్ఠ స్థాయికి జారుకున్నట్లు అయింది.  వైరస్‌ మరింత విజృంభిస్తుండటంతో చమురుకు డిమాండ్‌ పడిపోతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అంతకంతకు పడిపోతున్నాయి. అమెరికా మార్కెట్లో క్రూడాయిల్‌ ధర బుధవారం ఒకేరోజు 1.49 డాలర్లు లేదా 5.53 శాతం తగ్గి 25.46 డాలర్లకు జారుకున్నది. ఏప్రిల్‌ 2003 తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి ధరలు. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరలు 84 సెంట్లు లేదా 3 శాతం తగ్గి 27.89 డాలర్లకు పడిపోయాయి. కరోనా వైరస్‌ 154 దేశాలకు విస్తరించడంతో చమురు డిమాండ్‌ అనూహ్యంగా పడిపోయిందని, దీంతో ధరలు భారీగా పతనమయ్యాయని గోల్డ్‌మన్‌ సాచ్స్‌ తెలిపింది. ప్రస్తుత నెలలో డిమాండ్‌ 80 లక్షల డాలర్లకు పడిపోనున్నట్లు అంచనావేస్తున్నది. ప్రస్తుతం 25 డాలర్ల స్థాయిలో కదలాడుతున్న ఇంధన ధరలు భవిష్యత్తులో 20 డాలర్లకు పడిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.  


logo