e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home బిజినెస్ కెనరా కరోనా రుణాలు

కెనరా కరోనా రుణాలు

కెనరా కరోనా రుణాలు

రూ.25వేల నుంచి 50 కోట్లదాకా లోన్లు

న్యూఢిల్లీ, మే 28: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ కెనరా బ్యాంక్‌.. కరోనా వైరస్‌ నేపథ్యంలో శుక్రవారం మూడు రుణ పథకాలను ప్రకటించింది. హెల్త్‌కేర్‌ క్రెడిట్‌, వ్యాపార రుణాలు, వ్యక్తిగత రుణాలను ఆఫర్‌ చేసింది. ఈ స్కీంల ద్వారా కనిష్ఠంగా రూ.25వేలు, గరిష్ఠంగా రూ.50 కోట్ల వరకు రాయితీ వడ్డీరేటుకే రుణాలిచ్చేందుకు ముందుకు వచ్చింది.
చికిత్స హెల్త్‌కేర్‌ క్రెడిట్‌
ఈ పథకం ద్వారా రూ.10 లక్షల నుంచి 50 కోట్ల వరకు రుణ సదుపాయం పొందవచ్చు. గుర్తింపు పొందిన దవాఖానలు, నర్సింగ్‌ హోంలు, వైద్యులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు, పాథాలజీ ల్యాబ్‌లు తదితర ఆరోగ్య సంరక్షణ రంగంలోని అన్నింటికీ ఈ లోన్లకు అర్హత ఉంటుంది. రుణ కాలపరిమితి 10 ఏండ్ల వరకు ఉన్నది. 18 నెలల వరకు మారటోరియం కూడా వర్తిస్తుంది. వచ్చే ఏడాది మార్చి ఆఖరుదాకా ఈ లోన్‌ అందుబాటులో ఉంటుంది.
జీవన్‌రేఖ హెల్త్‌కేర్‌ బిజినెస్‌ లోన్‌
ఈ స్కీంపై రూ.2 కోట్ల వరకు రుణాలను పొందవచ్చు. నమోదిత దవాఖానలు, నర్సింగ్‌ హోంలకు మెడికల్‌ ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల వంటి హెల్త్‌కేర్‌ ఉత్పత్తుల సరఫరాదారులు, తయారీదారులకు ఈ లోన్లు వర్తిస్తాయి. ప్రాసెసింగ్‌ ఫీజులూ వర్తించబోవని తెలిపింది. ఎంఎస్‌ఎంఈలకు పూచీకత్తు అక్కర్లేదు. అయితే నాన్‌ ఎంఎస్‌ఎంఈలకు 25 శాతం కనీస పూచీకత్తు ఉండాల్సిందే. వచ్చే ఏడాది మార్చి చివరిదాకా ఈ రుణ సౌకర్యం వర్తిస్తుంది.
సురక్ష వ్యక్తిగత రుణం
ఈ లోన్‌పై రూ.25వేల నుంచి 5 లక్షల వరకు తక్షణ రుణ సదుపాయం పొందవచ్చు. కరోనా చికిత్సకు, దవాఖాన నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖర్చులకు ఖాతాదారులు ఈ నిధులను వాడుకోవచ్చు. దీనికి 6 నెలల మారటోరియం వర్తిస్తుంది. ప్రాసెసింగ్‌ ఫీజూ ఉండదు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకే ఈ పథకం అందుబాటులో ఉంటుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కెనరా కరోనా రుణాలు

ట్రెండింగ్‌

Advertisement