ఆదివారం 31 మే 2020
Business - Apr 08, 2020 , 19:21:41

క‌రోనా ఎఫెక్ట్‌: క్షీణిస్తున్న రూపాయి

క‌రోనా ఎఫెక్ట్‌: క్షీణిస్తున్న రూపాయి

ముంబై: ప్ర‌పంచాన్నిఅల్ల‌క‌ల్లోలం చేస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని రంగాల‌పైన తీవ్ర‌ప్ర‌భావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా ఆర్థివ వ్య‌వ‌స్థ‌ల‌ను చిన్నాబిన్నం చేస్తోంది. దేశంలో లాక్‌డౌన్ కార‌ణంగా వినియ‌మ డిమాండ్ భాగా క్షీణిస్తోంది.  దీంతో పాటుగా అంత‌కంత‌కూ క‌రోనా  కేసుల సంఖ్య పెరుగుతున్న క్ర‌మంలో లాక్‌డౌన్ మ‌రికొన్ని రోజులు పెంచ‌వ‌చ్చ‌నే ఊహ‌గానాల‌తో దేశీయ క‌రెన్సీ రూపాయి మ‌రింత ప‌త‌న‌మైంది. 75.83 ద‌గ్గ‌ర ప్రారంభ‌మైన రూపాయి డాల‌ర్ మార‌కంలో 76 మార్క్‌ దిగువ‌కు ప‌డిపోయింది.  మొత్తానికి క‌రోనా ఎఫెక్ట్ డాలరుతో పోలిస్తే రూపాయి విలువ  6.98 శాతం క్షీణించింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు,  డాలరు బలం దేశీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు రూపాయిని దెబ్బతీశాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ముడి చ‌మురు ధ‌ర‌లు బ్యారెల్‌కు 32 డాల‌ర్లు ఉండ‌గా  ప్రపంచ బెంచ్ మార్క్ ముడి చమురు 3.6 శాతం తగ్గి 31.78 డాలర్లకు చేరుకుంది. 


logo