గురువారం 04 జూన్ 2020
Business - Apr 07, 2020 , 10:07:56

క‌రోనా ఎఫెక్ట్‌: ప‌డిపోయిన పెట్రోల్, డీజిల్‌ అమ్మ‌కాలు

క‌రోనా ఎఫెక్ట్‌: ప‌డిపోయిన పెట్రోల్, డీజిల్‌ అమ్మ‌కాలు

న్యూఢిల్లీ: క‌రోనా ఎఫెక్ట్ అన్ని రంగాల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతుంది. ముఖ్యంగా పెట్రోల్‌, డీజిల్ అమ్మ‌కాల‌పై బాగా ఉన్న‌ది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ఇంధనాలకు డిమాండ్‌ గణనీయంగా పడిపోయింది. వెహికిల్స్‌ రోడ్ల మీదికి రావడం తగ్గిపోవడంతో  పెట్రోల్‌ అమ్మకాలు 17.6 శాతం, డీజిల్‌ విక్రయాలు 26 శాతం క్షీణించాయి. అటు అంత‌ర్జాతీయంగా, జాతీయంగా పలు విమానాలు కూడా రద్దు కావడంతో విమాన ఇంధన (ఏటీఎఫ్‌) అమ్మకాలు ఏకంగా 31.6 శాతం పడిపోయాయి. గ‌త రెండున్న‌రేళ్ల‌లో చ‌మురు అమ్మ‌కాలు ఈ స్థాయిలో ప‌డిపోవ‌డం ఇదే తొలిసార‌ని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఏటీఎఫ్‌ విక్రయాలు 31.6 శాతం క్షీణించగా.. ఎల్‌పీజీ అమ్మకాలు మాత్రం 1.9 శాతం పెరగడం విశేషం. అటు సేవ‌ల రంగంపై కూడా క‌రోనా తీవ్ర‌ప్ర‌భావం చూపింది.logo