శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Dec 30, 2020 , 01:26:32

ఇంట్లోనే కొత్త సంబురం

ఇంట్లోనే కొత్త సంబురం

  • న్యూ ఇయర్‌ వేడుకలకు కరోనా సెగ
  • ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్లు,ముందస్తుగానే మద్యం కొనుగోళ్లు: సర్వే

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ సెగ నూతన సంవత్సరం వేడుకలనూ తాకింది. ఈసారి న్యూ ఇయర్‌ సంబురాలను ఇంటికే పరిమితం చేయాలని దాదాపు 50 శాతం మంది భావిస్తుండటం గమనార్హం. హాస్పిటాలిటీ కన్సల్టెంట్‌ అవిఘ్న సొల్యూషన్స్‌ ఈ నెల 1 నుంచి 21 వరకు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ సర్వే జరిపింది. ఇందులో 4,500 మందికిపైగా పాల్గొన్నారు. ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్‌ చేసుకోవాలని, ముందస్తుగానే మద్యం కొనుగోళ్లు జరుపాలని చూస్తున్నట్లు ఈ సర్వేలో 65 శాతానికిపైగా మంది స్పష్టం చేశారు. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కొత్త ఏడాదికి ఆహ్వానం పలుకుతామని 48 శాతం మంది తెలిపారు. కేవలం 10 శాతం మందే హోటళ్లు లేదా రెస్టారెంట్లకు వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక 15 శాతం మంది హిల్స్‌ లేదా బీచ్‌లకు వెళ్లి న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో పాల్గొనాలనుకుంటున్నట్లు చెప్పారని అవిఘ్న సొల్యూషన్స్‌ వ్యవస్థాపకులు మయాంక్‌ శేఖర్‌ తెలిపారు.

వందల కోట్ల ఆదాయం దూరం

ఏటా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్బులు, రిసార్టులకు వందల కోట్ల రూపాయల్లో ఆదాయం లభిస్తుంది. డిసెంబర్‌ 31 రాత్రి కోసం ముందుగానే పెద్ద ఎత్తున బుకింగ్‌లూ జరిగిపోతుంటాయి. అయితే కరోనా వైరస్‌ కారణంగా ఈసారి ఆ పరిస్థితులు కనిపించడం లేదని సర్వే చెప్తున్నది. దీంతో భారీగా ఆదాయానికి గండి పడుతున్నదని, ఒక్క ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోనే రూ.200-250 కోట్ల వ్యాపారం నష్టపోయే వీలుందని అంచనా వేసింది. 

టోస్టులతోనే వీడ్కోలు

2020 యావత్‌ ప్రపంచానికే ఓ పీడకలగా నిలిచింది. ఈ నేపథ్యంలో చాలా మంది టోస్టులతోనే ఈ ఏడాదికి వీడ్కోలు పలుకాలని భావిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. మూడింట రెండొంతుల మంది ఆల్కహాలిక్‌ బేవరేజెస్‌తో పార్టీ జరుపుకోవాలని చూస్తున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. 56 శాతం మంది ఉత్తరాది ప్రత్యేక వంటకాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకోవాలనుకుంటుండగా, 23 శాతం మంది బిర్యానీతో ఎంజాయ్‌ చేయాలని చూస్తున్నారు. 

VIDEOS

logo