శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Business - Aug 12, 2020 , 02:36:32

దెబ్బతీసిన తయారీ పాతాళానికి పడిపోయిన పారిశ్రామికం

దెబ్బతీసిన తయారీ పాతాళానికి పడిపోయిన పారిశ్రామికం

 న్యూఢిల్లీ: పారిశ్రామికం మళ్లీ పడకేసింది. తయారీ, గనులు, విద్యుత్‌ రంగాలు నిరాశాజనక పనితీరు కనబర్చడంతో జూన్‌ నెలకుగాను పారిశ్రామిక వృద్ధి 16.6 శాతానికి పడిపోయినట్లు కేంద్ర ప్రభు త్వం వెల్లడించింది. తయారీ రంగంలో వృద్ధి 17.1 శాతానికి పడిపోగా, గనులు 19.8  శాతం, పవర్‌ 10 శాతం చొప్పున జారుకున్నాయి. ఏడాది కిత్రం 1.3 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాలు 36 శాతం వరకు ప్రతికూల వృద్ధి నమోదవగా, కన్జ్యూమర్‌ నాన్‌-డ్యూరబుల్‌ మాత్రం 14 శాతం వృద్ధిని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌) మధ్యకాలానికిగాను మైనస్‌ 35.9 శాతంగా నమోదైంది. 


logo