బుధవారం 05 ఆగస్టు 2020
Business - Jul 17, 2020 , 02:06:52

కరోనా క్లెయిమ్‌లను పరిష్కరించాలి

కరోనా క్లెయిమ్‌లను పరిష్కరించాలి

  • కరోనా క్లెయిమ్‌లను పరిష్కరించాలితాత్కాలిక దవాఖాననూ 
  • హాస్పిటల్‌గా పరిగణించాలి
  • బీమా సంస్థలకు  ఐఆర్‌డీఏఐ ఆదేశం

న్యూఢిల్లీ: తాత్కాలిక దవాఖానల్లో చికిత్స చేయించుకొనే కరోనా వైరస్‌ వ్యాధిగ్రస్థుల క్లెయిములను త్వరగా పరిష్కరించాలని సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలను ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసులను దృష్టిలో ఉంచుకొని పలు రాష్ర్టాల్లో తాత్కాలిక దవాఖానలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీచేసింది. ‘దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. త్వరలో ఈ కేసుల సంఖ్య 10 లక్షలు దాటే అవకాశమున్నది. కొవిడ్‌-19 బాధితుల చికిత్సకయ్యే ఖర్చులను నిబంధనల ప్రకారం బీమా పరిధిలోకి తీసుకురావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించిన తాత్కాలిక దవాఖానను హాస్పిటల్‌ లేదా నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌గా పరిగణించి సదరు వ్యాధిగ్రస్థుల బీమా క్లెయిములను త్వరగా సెటిల్‌ చేయాలి. కరోనా వైరస్‌ బారినపడి వైద్యులు లేదా సంబంధిత ప్రభుత్వ అధికారుల సలహా మేరకు తాత్కాలిక దవాఖానలో చేరిన పాలసీదారులకు ‘హాస్పిటల్‌' అనే నిర్వచనంతో నిమిత్తం లేకుండా చికిత్సకయ్యే ఖర్చులను అందజేయాలి’ అని గురువారం జారీచేసిన సర్క్యులర్‌లో ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ నిబంధనలను క్లెయిమ్‌ మార్గదర్శకాల్లో పొందుపర్చడంతోపాటు తక్షణమే ఈ విషయాన్ని థర్డ్‌పార్టీ అడ్మినిస్ట్రేటర్లకు తెలియజేయాలని ఐఆర్‌డీఏఐ ఆదేశించింది.


logo