గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 01, 2020 , 00:19:55

కోలుకున్న కీలక రంగాలు

కోలుకున్న కీలక రంగాలు
  • డిసెంబర్‌లో 1.3 శాతం వృద్ధి

న్యూఢిల్లీ, జనవరి 31: గడిచిన నాలుగు నెలలుగా ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్న కీలక రంగాలు ఎట్టకేలకు కోలుకున్నాయి. బొగ్గు, ఎరువులు, రిఫైనరీ రంగాలు ఆశాజనక పనితీరు కనబర్చడంతో డిసెంబర్‌ నెలకుగాను 1.3 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. డిసెంబర్‌ 2018లో నమోదైన 2.1 శాతంతో పోలిస్తే మాత్రం క్షీణత కనబరిచింది. క్రూడాయిల్‌, సహజ వాయువు, విద్యుత్‌ల్లో ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకోగా..బొగ్గు, రిఫైనరీ, ఎరువుల్లో మాత్రం పెరిగాయి. కానీ, స్టీల్‌, సిమెంట్‌ రంగాలు మందకొడి పనితీరు కనబరిచాయి. ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్యకాలంలో కీలక రంగాల్లో వృద్ధి 0.2 శాతంగా ఉన్నది. గతేడాది ఆగస్టు నుంచి నవంబర్‌ వరకు కీలక రంగాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది. 


logo