హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): గోల్డెన్ జూబ్లీహిల్స్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ట్రైడెంట్ హోటల్) రుణ పరిష్కార ప్రణాళికను ఆమోదిస్తూ హైదరాబాద్‌లోని కంపెనీ లా ట్రిబ్యునల్ గత ఫిబ్రవరి 7న ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొం ది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కోర్ హోటల్ వెంచర్స్ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలపై అభ్యంతరాలు ఉంటే నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో లేదా సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని కోర్ హోటల్‌కు తేల్చి చెప్పింది.