e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News అప్పుడే ఎండ‌ల తీవ్ర‌త‌.. ఏసీలు, ఫ్రిజ్‌ల‌కు గిరాకీ!

అప్పుడే ఎండ‌ల తీవ్ర‌త‌.. ఏసీలు, ఫ్రిజ్‌ల‌కు గిరాకీ!

అప్పుడే ఎండ‌ల తీవ్ర‌త‌.. ఏసీలు, ఫ్రిజ్‌ల‌కు గిరాకీ!

న్యూఢిల్లీ: దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ ఏడాది సాధారణ స్థాయి కంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంద‌ని భారత వాతావరణ శాఖ (ఐఎం‌డీ) పేర్కొన్న‌ది. దీంతో ఈ వేస‌విలో త‌మ ఉత్ప‌త్తుల‌కు భారీగా డిమాండ్ ఉంటుంద‌ని ఏసీలు, రిఫ్రిజిరేట‌ర్ల త‌యారీ సంస్థ‌లు ఆశాభావంతో ఉన్నాయి. వేడి వాతావరణానికి తోడు రెండో క‌రోనా వేవ్‌లో కేసులు ఎక్కువ‌వుతున్న వేళ‌.. వర్క్ హోమ్ చేసే వారి సంఖ్య పెరుగుతున్న‌ది. ఇది కూడా దేశంలో ఏసీ, రిఫ్రిజిరేటర్లకు డిమాండ్ పెర‌గ‌డానికి దారి తీస్తుంద‌న్న అభిప్రాయాలు ఉన్నాయి.

రిఫ్రిజిరేట‌ర్ల కోసం రెండు రెట్లు, ఏసీల కోసం మూడు రెట్ల ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయ‌ని అమెజాన్ తెలిపింది. దీంతోపాటు ప్ర‌జానీకం మ‌రో ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఏసీలు, ఫ్రిజ్‌ల కోసం ఆర్డ‌ర్లు పెడుతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఫ్యాన్లు, కూల‌ర్ల గిరాకీ పెరుగుతున్న‌ది. ఏసీల కోసం నాలుగు రెట్లు, మిగ‌తా వాటి కోసం 2.5 నుంచి మూడు రెట్ల డిమాండ్ పెరిగింద‌ని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

గత 3-4 నెలలుగా ఎయిర్ కండీషనర్ల విభాగంలో 25 శాతం వృద్ధిని సాధించామ‌ని, ఇక ముందు కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని ఆశిస్తున్నాం అని పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ & సీఈఓ మనీష్ శర్మ చెప్పారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి త్రైమాసికానిక‌ల్లా వంద‌ శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని పేర్కొన్నారు.

ఈ డిమాండ్ ఎయిర్ కండిషనర్ల‌కు మాత్రమే పరిమితం కాకుండా పానాసోనిక్ రిఫ్రిజిరేటర్లలో 30 శాతం రికార్డు వృద్ధిని సాధించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు మ‌నీశ్ శ‌ర్మ‌ పేర్కొన్నారు. మునుపటి సంవత్సరాలకు భిన్నంగా ఈ ఏడాది దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలలో అధిక డిమాండ్ ఉన్నట్లు చెప్పారు.

ఈ వేసవి కాలంలో పట్టణ మినీ-మెట్రో నగరాలలో బ్రాండెడ్ గృహోపకరణాల వాడకం పెరిగే అవకాశం ఉన్నద‌ని ఎసీలు, రిఫ్రిజిరేట‌ర్ల త‌యారీ సంస్థ‌ల ప్ర‌తినిధులు అంటున్నారు.

మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల‌తోపాటు ద్వితీయ, త్రుతీయ శ్రేణి నగరాల నుంచి డిమాండ్ పెరుగుతుంద‌ని వోల్టాస్ ప్రతినిధి పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పరికరాలను తయారు చేస్తున్నట్లు వోల్టాస్ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి:

ఇండియా విజ్ఞ‌ప్తి డోంట్ కేర్‌..సౌదీ ప్ర‌తి స‌వాల్‌!

సౌదీ ఔట్‌: ఇండియాకు చ‌మురు స‌ప్లయిలో అమెరికా నం.2

ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్‌తో బోలెడు బెనిఫిట్లు!

త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణను నియ‌మించిన రాష్ట్ర‌ప‌తి

ఓటు హ‌క్కు వినియోగించుకున్న న‌టుడు మ‌మ్ముట్టి

త‌మిళ‌నాడులో ఓటేసిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

ఓటు వేసిన డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌

తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు

పోలింగ్ బూత్‌లో పేలిన నాటు బాంబు

యోగి ఆదిత్య‌నాథ్‌, అమిత్ షాల‌ను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్‌కు మెయిల్

ఉద్ధవ్‌ ఠాక్రే కూడా రాజీనామా చేయాలి : అథావలే

2021-22 లో 12.5% కు చేరుకోనున్న భారత్‌ వృద్ధి రేటు : ఐఎంఎఫ్‌

వ‌డ్డీరేట్ల త‌గ్గింపులో సర్కారీ బ్యాంకులే బెస్ట్‌.. సంగతేంటంటే!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అప్పుడే ఎండ‌ల తీవ్ర‌త‌.. ఏసీలు, ఫ్రిజ్‌ల‌కు గిరాకీ!

ట్రెండింగ్‌

Advertisement