ఆదివారం 24 మే 2020
Business - Feb 16, 2020 , 00:11:47

అందుబాటులోకి ‘క్రెడాయ్‌ ఆవాస్‌'

అందుబాటులోకి ‘క్రెడాయ్‌ ఆవాస్‌'

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: నిర్మాణ రంగ సంఘం క్రెడాయ్‌ శనివారం ఓ సరికొత్త యాప్‌ను ప్రారంభించింది. ఇండ్ల కొనుగోలుదారులు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు పరస్పరం అనుసంధానమయ్యేలా ‘క్రెడాయ్‌ ఆవాస్‌' పేరుతో ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ ద్వారా కొనుగోలుకు వీలున్న ఆస్తుల క్రయవిక్రయాలు వేగంగా, సులభంగా జరుగగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. చత్తీస్‌గఢ్‌ గృహ, పర్యావరణ, రవాణా, అటవీ, న్యాయ శాఖల మంత్రి మహమ్మద్‌ అక్బర్‌ రాయ్‌పూర్‌లో దీన్ని ఆవిష్కరించారు. గత నెల నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ కూడా పూర్తయిన ఇండ్ల మార్కెటింగ్‌ కోసం ఓ ఈ-కామర్స్‌ వేదికను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.logo