e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News బంగారం కొనేముందు క‌న్ఫూజ‌న్ వ‌ద్దు!

బంగారం కొనేముందు క‌న్ఫూజ‌న్ వ‌ద్దు!

బంగారం కొనేముందు క‌న్ఫూజ‌న్ వ‌ద్దు!

న్యూఢిల్లీ: పెండ్లి లేదా కుటుంబ వేడుక వ‌చ్చిందంటే భార‌తీయులు బంగారం కొనుగోలు చేయ‌డం లేదా గిఫ్ట్‌గా ఇవ్వ‌డం స‌ర్వ‌సాధార‌ణం. క‌రోనా మ‌హ‌మ్మారితో బంగారం ధ‌ర కొండెక్కిన నేప‌థ్యంలో భారీ మొత్తంలో ఖ‌ర్చు చేస్తున్న‌ప్పుడు ఆచితూచి స్పందించ‌డం త‌ప్ప‌నిస‌ర‌ని బులియ‌న్ మార్కెట్ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

ఇన్వెస్ట్‌మెంట్ విష‌యానికి వ‌స్తే బంగారం అంత సుర‌క్షితం మ‌రొక‌టి లేదు. తొలిసారి బంగారం కొనుగోలు చేసేవారు.. తాము కొనే బంగారం ఆభ‌ర‌ణం ధ‌ర‌పై సంబంధిత య‌జమాని మాట‌కే క‌ట్టుబ‌డి ఉండ‌టానికి బ‌దులు దానిపై హాల్‌మార్క్ ఉందా? అన్న అంశం ఎంక్వైరీ చేయ‌డం మ‌రువొద్దు.

- Advertisement -

జూన్ ఒక‌టో తేదీ నుంచి హాల్ మార్క్ ఉన్న బంగారం ఆభ‌ర‌ణాల విక్ర‌యాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్రం ఆదేశాలిచ్చిన సంగ‌తి తెలిసిందే. తొలుత ఈ ఏడాది జ‌న‌వ‌రి 15వ తేదీ వ‌ర‌కే పొడిగించినా, జ్యువెల్ల‌రీ వ్యాపారుల విజ్ఞ‌ప్తుల మేర‌కు జూన్ వ‌ర‌కు పొడిగించింది.

ఇక‌ముందు గ‌డువు పొడిగింపు ఉండ‌బోద‌ని కేంద్రం తేల్చేసింది. కానీ క‌రోనా వ‌ల్ల పాత స్టాక్ ఉండిపోయింద‌ని, డిమాండ్ పెద్ద‌గా లేద‌ని ఇండియ‌న్ బులియ‌న్ అండ్ జ్యువెల్ల‌ర్స్ అసోసియేష‌న్ (ఐబీజేఏ) పేర్కొంది. గ‌డువు ముగిసిన త‌ర్వాత జ్యువెల్ల‌ర్లు కేవ‌లం 14,18, 22 క్యారెట్ల ప్ర‌మాణాల‌తో కూడిన ఆభ‌ర‌ణాలు మాత్ర‌మే విక్ర‌యించ‌గ‌ల‌రు.

బంగారం ఆభ‌ర‌ణాల‌పై హాల్‌మార్కింగ్ త‌ప్ప‌నిస‌రి చేయ‌డం వెనుక అసలు ల‌క్ష్యం క‌ల్తీ, మోసాల‌ను అరిక‌ట్టడమే. ఫైన్‌నెస్‌, ప్యూరిటీ ప్ర‌మాణాల‌ను జ్యువెల్ల‌రీ వ్యాపారులు, త‌యారీదారులు త‌ప్ప‌నిస‌రిగా పాటించేలా చూడ‌టం.

బంగారంపై హాల్‌మార్కింగ్ విధానం జూన్ ఒక‌టో తేదీ నుంచి అమ‌లులోకి వ‌చ్చినా, వాయిదా ప‌డినా కొనుగోలుదారులు మాత్రం హాల్‌మార్క్ జ్యువెల్ల‌రీ కోసం డిమాండ్ చేయాల‌ని సూచిస్తున్నారు. అయితే వినియోగ‌దారులు హాల్‌మార్క్ లేకున్నా బంగారం ఆభ‌ర‌ణాల‌ను విక్ర‌యించొచ్చు.

బంగారం ఆభ‌ర‌ణాలు కొనుగోలు చేసేముందు దాని ప్యూరిటీ, హాల్‌మార్కింగ్ సెంట‌ర్ గుర్తింపు మార్క్ గురించి తెలుసుకుంటే.. మీరు కొనాల‌నుకుంటున్న బంగారం ధ‌ర తెలుసుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు 22 క్యారెట్ల తులం బంగారం కొనాల‌నుకుంటే.. 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ.40 వేలు ఉంద‌నుకోండి.

మార్కెట్ విలువ ప్ర‌కారం మీరు కొనే 91.6 ప్యూరిటీ బంగారం ధ‌ర రూ.40 వేల నుంచి రూ.36,640కి దిగి వ‌స్తుంది. జ్యువెల్ల‌రీ త‌యారీదారు త‌యారీ ఖ‌ర్చులు ప్ల‌స్ ట్యాక్స్ క‌లిపి ధ‌ర‌ను చెబుతారు. హాల్ మార్కింగ్ వ‌ల్ల మీరు కొనే బంగారం ధ‌ర పార‌ద‌ర్శ‌కంగా తెలుసుకోవ‌చ్చు.

ఇవి కూడా చదవండి..

పెండ్లి గౌనులో వచ్చి కరోనా టీకా తీసుకున్న యువతి.. అసలు కారణం తెలిసి షాకైన వైద్య సిబ్బంది

57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!

త్వరలో కరోనా మూడో వేవ్‌ వచ్చే అవకాశం : ఆదిత్యా ఠాక్రే

ప్రిన్సిపాల్‌ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య

నిత్యం 3 లక్షల రెమ్‌డెసివిర్‌ డోసుల ఉత్పత్తి : మన్సుఖ్‌ మాండవీయ

కరోనా నివారణకు 8 మార్గాలు

రేపు అంగారకుడిపై ఎగరనున్న నాసా హెలికాప్టర్‌

పేదల బాగు కోసం భూదానం.. చరిత్రలో ఈరోజు

ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్‌ఖాన్‌

రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు

బతుకుదెరువు కోసం ఆటో న‌డుపుతున్న జాతీయ బాక్సర్

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బంగారం కొనేముందు క‌న్ఫూజ‌న్ వ‌ద్దు!
బంగారం కొనేముందు క‌న్ఫూజ‌న్ వ‌ద్దు!
బంగారం కొనేముందు క‌న్ఫూజ‌న్ వ‌ద్దు!

ట్రెండింగ్‌

Advertisement