మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 19, 2020 , 00:29:19

ఉద్యోగులకు నిరాశే!

ఉద్యోగులకు నిరాశే!
  • 2020లో సరాసరిగా పెరుగనున్న వేతనాలు 9.1 శాతం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: వేతనాల పెంపు విషయంలో సగటు ఉద్యోగికి నూతన సంవత్సరంలోనూ నిరాశ తప్పడం లేదు. 2020లో దేశీయ కార్పొరేట్‌ సంస్థలు తమ ఉద్యోగుల జీతాలను సరాసరిగా 9.1 శాతం పెంచబోతున్నాయి. అయినప్పటికీ ఆసియా పసిఫిక్‌ దేశాల్లో పెరుగనున్న వేతనాలతో పోలిస్తే భారత్‌లో  అధికంగా ఉండటం విశేషం. అధిక నైపుణ్యం, స్కిల్‌ కలిగిన సిబ్బందిని నియమించుకోవడానికి మొగ్గుచూపుతున్న సంస్థలు, వీరికి ఎంతైన జీతాలు చెల్లించడానికి ఆసక్తి చూపుతున్నాయని లీడింగ్‌ హెచ్‌ఆర్‌ కన్సల్టెన్సీ ఓన్స్‌ వార్షిక నివేదికలో వెల్లడించింది. 2019లో సరాసరిగా పెరిగిన 9.3 శాతంతో పోలిస్తే ఇది తక్కువ కాగా, అలాగే  గడిచిన పదేండ్లలోనూ ఇదే అత్యల్పం. సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 39 శాతం సంస్థలు 10 శాతం పెంచేందుకు ఆసక్తి చూపుతుండగా, 42 శాతం 8-10 శాతం వరకు పెంచబోతున్నట్లు ప్రకటించాయి. 


20 పారిశ్రామిక రంగాలకు చెందిన వెయ్యి కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఆసియా పసిఫిక్‌ దేశాల్లో భారత్‌లోనే అత్యధికంగా 9.1 శాతం పెరుగనుండగా, చైనాలో 6.3 శాతం అధికమవనున్నది. అలాగే ఫిలిప్పీన్స్‌లో 5.8 శాతం పెరుగనున్న జీతాలు..మలేషియాలో 5.3 శాతం, సింగపూర్‌లో 3.8 శాతం, ఆస్ట్రేలియాలో 3.1 శాతం పెరుగనున్నాయని తెలిపింది. గతేడాది నిరాశాజనక ఆర్థిక పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్‌లో జీతాలు అధికంగానే పెరుగుతున్నాయని, ముఖ్యంగా ఆసియా పసిఫిక్‌ ప్రాంతాల్లో కెల్లా ఇక్కడే అధికమని వోన్‌ భాగస్వామి ఫెర్నాడేజ్‌ వెల్లడించారు. తయారీ, ఫార్మాస్యూటికల్స్‌ రంగాల్లో పనిచేస్తున్న వారి జీతభత్యాలు అధికంగా పెరుగనుండగా, ఆ తర్వాతి ఎఫ్‌ఎంసీజీ, కెమికల్స్‌, ఇతర విభాగాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. 


logo
>>>>>>