న్యూఢిల్లీ, జూన్ 30: తమ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ డెలివరీలు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మొదలుపెడతామని బజాజ్ ఆటో ప్రకటించింది. బహుళప్రాచుర్యం పొందిన చేతక్ బ్రాండ్‌ను ఎలక్ట్రిక్ రూపంలో కంపెనీ ఇంతకుముందే ఆవిష్కరించింది. చేతక్ ప్రీమియం, చేతక్ అర్బేన్ పేర్లతో రెండు వేరియంట్స్‌లో ఈ స్కూటర్లు విడుదలవుతాయి.