e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home News కాగ్నిజెంట్‌లో కొత్త‌గా ల‌క్ష ఉద్యోగాలు..

కాగ్నిజెంట్‌లో కొత్త‌గా ల‌క్ష ఉద్యోగాలు..

న్యూఢిల్లీ: వివిధ ఐటీ సంస్థ‌లు కొత్త వారికి భారీగా కొలువులు ఇచ్చేందుకు స‌న్న‌ద్ధం అవుతున్నాయి. తాజాగా అమెరికా ఐటీ జెయింట్ కాగ్నిజెంట్ ఇండియా ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ల‌క్ష మందిని నియ‌మించుకోవాల‌ని భావిస్తున్న‌ది. ఐటీ స‌ర్వీసులు, బీపీవో రంగాల్లో ప్ర‌తిభావంతులైన నిపుణుల‌ను నియ‌మించుకునేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ది.

కాగ్నిజెంట్‌లో స‌ర్దుబాట్లు ఇలా

జూన్ నెలాఖ‌రు నాటికి కంపెనీలో మూడు ల‌క్ష‌ల మంది పై చిలుకు ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కాంప‌న్సేష‌న్ అడ్జ‌స్ట్‌మెంట్లు, జాబ్ రొటేష‌న్లు, రీ స్కిలింగ్‌, ప్ర‌మోష‌న్లు చేప‌ట్ట‌నున్న‌ట్లు కాగ్నిజెంట్ తెలిపింది.

2021 నాటికి ల‌క్ష మందికి కొలువు

- Advertisement -

2021 చివ‌రి నాటికి ల‌క్ష మందిని నియ‌మించుకుంటామ‌ని సంస్థ సీఈవో బ్రెయిన్‌ హంఫ్రైస్ చెప్పారు. ఈ ప్ర‌ణాళిక‌లో భాగంగా ఈ ఏడాది 2021లో 30 వేల మంది న్యూ గ్రాడ్యుయేట్లు, 2022లో 45 వేల మందికి ఆఫ‌ర్లు ఇవ్వ‌నున్న‌ది. భార‌త్‌తోపాటు ప్ర‌పంచ వ్యాప్తంగా జూనియ‌ర్ స్థాయి, మ‌ధ్య శ్రేణి నిపుణుల‌ను నియ‌మించుకుంటామ‌న్న‌ది.

జూన్ త్రైమాసికంలో 41.8 % వ్రుద్ధి

జూన్ నెల‌తో ముగిసిన త్రైమాసికంలో కాగ్నిజెంట్ నిక‌ర ఆదాయం రూ.3,801.7 కోట్లు (512 మిలియ‌న్ల డాల‌ర్లు) గ‌డించింది. గ‌తేడాది జూన్ త్రైమాసికంలో కేవ‌లం 361 మిలియ‌న్ డాల‌ర్ల నిక‌ర ఆదాయం మాత్ర‌మే సంపాదించింది. అంటే ఈ ఏడాది జూన్ నెల‌తో ముగిసిన త్రైమాసికంలో 41.8 శాతం పురోగ‌తి న‌మోదు చేసింది.

గైడెన్స్‌ను దాటేసిన రెవెన్యూ

ఇక ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ 10.2 నుంచి 11.2 శాతానికి పెరుగుతుంద‌ని కాగ్నిజెంట్ అంచ‌నా వేసింది. సంస్థ ఆదాయం 14.6 పెరిగి 460 కోట్ల డాల‌ర్ల‌కు చేరుకున్న‌ది. గ‌తేడాది కేవ‌లం 400 కోట్ల డాల‌ర్లు మాత్ర‌మే. ఇది 2021 జూన్ త్రైమాసికంలో 10.5-11.5 శాతం రెవెన్యూ గ్రోత్ ఉంటుంద‌ని గైడెన్స్ అంచ‌నాల‌ను మించిపోయింది.

ఇవి కూడా చ‌ద‌వండి:

స్మార్ట్‌ సిటీ రేసులో దూసుకెళ్తున్న ఓరుగల్లు

మమతా బెనర్జీని కలిసిన డీఎంకే ఎంపీ కనిమోళి

EWS Reservation | మెడిక‌ల్ కోర్సుల్లో రిజ‌ర్వేషన్లు.. ఓబీసీల‌కు 27, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం

Bharti Arora | ‘శ్రీకృష్ణుడి సేవ’ కోసం ఐపీఎస్‌కు రాజీనామా..

ఆ జ‌డ్జిది యాక్సిడెంట్ కాదు హ‌త్యే.. వీడియో

సాహితీ ప్రపంచంలో సినారెది ప్రత్యేక స్థానం: ఉపరాష్ట్రపతి వెంకయ్య

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana