న్యూఢిల్లీ, ఆగస్టు 13: కాఫీ డే ఎంటర్ప్రైజెస్ క్రమంగా నష్టాలను తగ్గించుకుంటున్నది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.18 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.117.28 కోట్ల నష్టంతో పోలిస్తే భారీగా తగ్గింది. కంపెనీ ఆదాయం రూ.81.52 కోట్ల నుంచి రెండు రెట్లు పెరిగి రూ.210.49 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంట్లో కాఫీ, అనుబంధ వ్యాపారాల నుంచి రూ.189.63 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే ఆతిథ్య రంగం నుంచి రూ.14.32 కోట్ల ఆదాయం లభించింది. నిర్వహణ ఖర్చులు ఏడాది ప్రాతిపదికన 18 శాతం అధికమై రూ.237.75 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. కాఫీ డే కేఫ్ అవుట్లెట్ల సంఖ్యను 550 నుంచి 493కి తగ్గించింది.