శనివారం 06 మార్చి 2021
Business - Jan 19, 2021 , 16:30:22

ఉపయోగించని బ్యాంకు అకౌంట్లు మూసేయండిలా!

ఉపయోగించని బ్యాంకు అకౌంట్లు మూసేయండిలా!

న్యూఢిల్లీ : ప్రైవేటు రంగ జీతం ఉన్న ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండటం సహజం. కంపెనీని మార్చినప్పుడల్లా ఉద్యోగులు కొత్త బ్యాంకు ఖాతా తెరవాలి. కొన్ని నెలలు జీరో బ్యాలెన్స్ జీతం ఖాతాలో జీతం క్రెడిట్ కాకపోతే కొన్ని బ్యాంకులు కస్టమర్‌ను పొదుపు ఖాతాగా మారుస్తాయి. దీని తరువాత చాలా బ్యాంకుల్లో పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉంచడం తప్పనిసరిగా నియమాలు ఉండటం తలనొప్పిగా తయారైంది. వినియోగదారులు ఒకటి కంటే ఎక్కువ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించడంలో తరచుగా విఫలమవుతూ ఇబ్బందులకు గురవుతున్నారు.

ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను తెరిచినట్లయితే, అవి ఉపయోగపడకపోతే.. వాటిని నిరభ్యంతరంగా మూసివేయవచ్చు. ఎందుకంటే, ఖాతాలను ఉపయోగించనప్పుడు ఆయా ఖాతాల్లో తప్పనిసరిగా త్రైమాసిక కనీస మొత్తాన్ని నిర్వహించాలన్న నిబంధనలు ఉన్నాయి. అందువల్ల, ఉపయోగంలో లేని ఈ ఖాతాలను ఎంత వీలైంత అంత త్వరగా మూసివేయడం సముచితం. అయితే, బ్యాంకు ఖాతాలను మూసివేయబోతున్నట్లయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి.

1. బ్యాంకు ఖాతాను శాశ్వతంగా మూసివేయడానికి ఖాతాదారుడు బ్యాంకు శాఖకు వెళ్ళాలి. ఖాతా మూసివేసే ఫాం నింపి దాంతో పాటుడి-లింకింగ్ ఫాంను కూడా సమర్పించాలి. అలాగే ఉపయోగించని చెక్ బుక్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డును బ్యాంకులో జమ చేయాలి.

2. పొదుపు ఖాతా తెరిచిన 14 రోజుల్లోపు దాన్ని మూసివేయడానికి ఎటువంటి రుసుం చెల్లించాల్సిన పని లేదు. ఖాతా తెరిచిన తర్వాత 14 రోజుల నుంచి ఒక సంవత్సరం మధ్య ఖాతాను మూసివేయడానికి బ్యాంకులు రుసుం వసూలు చేస్తాయి. వివిధ బ్యాంకుల ఫీజులు ఒక్కో రకంగా ఉంటాయి. ఇదే సమయంలో ఖాతా తెరిచిన ఏడాది తర్వాత ఖాతా మూసివేయడానికి ఎటువంటి ఛార్జీ విధించరు.

3. ఉపయోగించని బ్యాంకు ఖాతాను మూసివేస్తుంటే.. మొదట ఆ ఖాతా నుంచి ఆటోమేటిక్ డెబిట్లను నిలిపివేయాలి. ఖాతాను మూసివేసేటప్పుడు, ఖాతాకు లింక్ చేయబడిన అన్ని డెబిట్‌లు తొలగించబడతాయి. బ్యాంక్ ఖాతా నెలవారీ రుణ ఈఎంఐలతో అనుసంధానించబడి ఉంటే.. అప్పుడు రుణదాతకు కొత్త ప్రత్యామ్నాయ బ్యాంక్ ఖాతా నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.

4. పాత జీతం ఖాతాను మూసివేయబోతున్నట్లయితే.. ఖాతాకు కొత్త ఖాతా వివరాలను ఇవ్వండి. తద్వారా నెలనెలా జీతం లేదా పెన్షన్ కొత్త ఖాతాలో జమ చేసేందుకు అవకాశాలు ఉంటాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo