శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 27, 2021 , 02:08:49

లీగల్‌ సంస్థలకూ సీకేవైసీఆర్‌ పొడిగించిన ఐఆర్డీఏఐ

లీగల్‌ సంస్థలకూ సీకేవైసీఆర్‌ పొడిగించిన ఐఆర్డీఏఐ

న్యూఢిల్లీ, జనవరి 26: లీగల్‌ సంస్థ (ఎల్‌ఈ)లకు సెంట్రల్‌ నో యువర్‌ కస్టమర్‌ రిజిస్ట్రీ (సీకేవైసీఆర్‌)ని బీమా రంగ రెగ్యులేటర్‌ ఐఆర్డీఏఐ పొడిగించింది. ఏప్రిల్‌ 1 నుంచి తెరిచే లీగల్‌ సంస్థల ఖాతాలకు సంబంధించిన కేవైసీ సమాచారాన్ని సీకేవైసీఆర్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిందిగా రిపోర్టింగ్‌ సంస్థ (ఆర్‌ఈ)లను ఆదేశించింది. మనీ లాండరింగ్‌ నిరోధక నిబంధనలు 2005 ప్రకారం ఇప్పటికే వ్యక్తిగత ఖాతాలన్నింటికి సంబంధించిన వివరాలను రిపోర్టింగ్‌ సంస్థలు సీకేవైసీఆర్‌లోకి అప్‌లోడ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో లీగల్‌ సంస్థల ఖాతాలకూ దీన్ని అనుసరించాలని జీవిత, జనరల్‌ ఇన్సూరర్ల (స్టాండలోన్‌ హెల్త్‌ ఇన్సూరర్లు సహా)కు ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. గతేడాది డిసెంబర్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) సైతం అన్ని సంస్థలకూ ఇదేతరహా ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే.

VIDEOS

logo