గురువారం 28 మే 2020
Business - May 20, 2020 , 00:25:58

నాబార్డ్‌ చైర్మన్‌గా గోవిందరాజులు

నాబార్డ్‌ చైర్మన్‌గా గోవిందరాజులు

న్యూఢిల్లీ, మే 19: వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్‌ (నాబార్డ్‌) చైర్మన్‌గా చింతల గోవిందరాజులు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర సిబ్బంది నియామకాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా ఉన్నారు. జూలై 31, 2022న గోవిందరాజులు పదవీ విరమణ పొందనుండగా, అప్పటిదాకా ఈయనే నాబార్డ్‌ చైర్మన్‌గా ఉండనున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోగల బ్రాహ్మణ కోడూరు గోవిందరాజులు స్వగ్రామం. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన నాబార్డ్‌ ఇంటర్వ్యూల్లో తీవ్ర పోటీ మధ్య గోవిందరాజులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే నాబార్డ్‌ డిప్యూటీ ఎండీలుగా షాజీ కేవీ, పీవీఎస్‌ సూర్యకుమార్‌లు నియమితులైనట్లు సదరు ఆదేశాలు పేర్కొన్నాయి.logo