గురువారం 06 ఆగస్టు 2020
Business - Jul 03, 2020 , 02:42:33

టిక్‌టాక్‌కు రూ.45 వేల కోట్ల నష్టం

టిక్‌టాక్‌కు రూ.45 వేల కోట్ల నష్టం

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌తోపాటు మరో 58 యాప్‌లను నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులను దెబ్బతీస్తున్నది. టిక్‌టాక్‌ మాతృ సంస్థ అయిన బైట్‌డ్యాన్స్‌ ఏకంగా రూ.45 వేల కోట్లు (6 బిలియన్‌ డాలర్లు) మేర నష్టపోనున్నట్లు చైనాకు ప్రభుత్వ మీడియా సంస్థ ‘గ్లోబల్‌ టైమ్స్‌' స్పష్టంచేసింది. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, భద్రతను దృష్టిలో ఉంచుకొని నరేంద్రమోదీ సర్కార్‌ ఇటీవల టిక్‌టాక్‌, హెల్లోతోపాటు అనేక చైనా యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.logo