సోమవారం 01 మార్చి 2021
Business - Feb 16, 2021 , 03:07:31

పెస్కీ కాల్స్‌కు చెక్‌

పెస్కీ కాల్స్‌కు చెక్‌

  • డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ఏర్పాటు దిశగా కేంద్రం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఇబ్బందికర కాల్స్‌ ముప్పును ఎదుర్కోడానికి, టెలికం వనరులను ఉపయోగించుకుని జరుగుతున్న ఆర్థిక మోసాలకు చెక్‌ పెట్టడానికి ఓ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌తోపాటు కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ వ్యవస్థను కేంద్రం ఏర్పాటు చేయనున్నది. టెలికం శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సూచన మేరకు ఇవి రానున్నాయి. ప్రసాద్‌ నేతృత్వంలో ఓ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న టెలీమార్కెటీర్లు, మొబైల్‌ వినియోగదారులను వేధిస్తున్న మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

అయాచిత సందేశాలు, అవాంఛిత ఫోన్‌ కాల్స్‌కు కళ్లెం వేయాలని సూచించారు. సామాన్యుల కష్టార్జితాన్ని కొందరు అక్రమార్కులు మోసం చేసి దోచుకుంటున్నారని, ఇందుకు టెలికం వ్యవస్థ వేదిక అవుతుండటంపట్ల ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇకపై ఇలాంటి మోసాలకు తావు లేకుండా పటిష్ఠ నిఘా, రక్షణ వ్యవస్థలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

VIDEOS

logo