e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News Charminar-Golconda| ట‌న్నెల్‌పై హైద‌రాబాదీల్లో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు.. గుప్త నిధులుంటాయా?!

Charminar-Golconda| ట‌న్నెల్‌పై హైద‌రాబాదీల్లో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు.. గుప్త నిధులుంటాయా?!

Charminar-Golconda| ట‌న్నెల్‌పై హైద‌రాబాదీల్లో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు.. గుప్త నిధులుంటాయా?!

హైద‌రాబాద్: హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప్ర‌స్తుత అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ ఆఫ్ ఇండియా వ‌ద్దే బెల్లా విస్టా ప్యాలెస్ ఉంది. ఈ ప్యాలెస్ కింద భూగ‌ర్భ బంకర్ ఉంది. దీనికి సంబంధించిన ఫొటోగ్రాఫ్‌లతో సిటీ ఫొటోగ్రాఫ‌ర్‌, చ‌రిత్ర‌కారుడు మ‌హ‌మ్మ‌ద్ హ‌బీబ్ ఉర్ రెహ్మాన్ ధ్రువీక‌రించారు. దాన్ని ప్రిన్స్ ఆజంఝా ట‌న్నెల్ అని కూడా పిలుస్తారు.

ఫైగాస్ ఆఫ్ ది ద‌క్క‌న్ పేరుతో చ‌ర్చ‌లు

- Advertisement -

తాజాగా చారిత్ర‌క చార్మినార్‌-గోల్కొండ కోటల‌ను క‌లిపే బంక‌ర్ల (ట‌న్నెల్‌) నెట్‌వ‌ర్క్ ఉండి ఉండొచ్చున‌న్న చర్చ పునరావృతం అవుతున్న‌ది. హ‌బీబ్ ఉర్ రెహ్మాన్ ఫేస్‌బుక్ ఖాతాలో ‘ఫైగాస్ ఆఫ్ ది ద‌క్క‌న్’ అనే పేరుతో చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

వైమానిక దాడుల‌ను త‌ప్పించుకునేందుకు..

రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో వైమానిక దాడుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి అప్ప‌టి రాజులు.. చార్మినార్‌-గోల్కొండ కోట మ‌ధ్య ట‌న్నెల్‌-బంక‌ర్‌ నిర్మించి ఉంటారంటారు హ‌బీబ్ ఉర్ రెహ్మాన్‌. చార్మినార్‌-గోల్కొండ మ‌ధ్య ట‌న్నెల్ చ‌ర్చ పాత‌దైనా ప‌లు స‌ర్కిళ్ల‌లో మ‌ళ్లీ తాజాగా పుంజుకున్న‌ది.

చార్మినార్‌, గోల్కొండ మ‌ధ్య ప్ర‌యాణించ‌డానికి ట‌న్నెల్‌ను రాజులు ఉప‌యోగించి ఉండొచ్చున‌ని హ‌బీబ్ పేర్కొన్నారు. అంతే కాదు.. ఈ ట‌న్నెల్‌లో గుర్రాల‌పై సైనికులు ప‌హారా కాసేవార‌ని కూడా తెలుస్తున్న‌ది.

కుతుబ్‌షాహీల హ‌యాంలో ట‌న్నెళ్ల నిర్మాణం

ఒక ప్ర‌భుత్వ పాఠ‌శాల ప్రిన్సిపాల్ మ‌హ్మ‌ద్ ఫ‌రూఖ్ తాహెర్ మాట్లాడుతూ విదేశీ రాజుల‌, పాల‌కుల దాడుల‌ను త‌ప్పించుకోవ‌డానికి కుతుబ్‌షాహీల కాలంలో ట‌న్నెళ్లు నిర్మించార‌ని విన్నామ‌న్నారు. ఈ ట‌న్నెళ్ల‌లోనే గుప్త నిధులు ఉండి ఉండొచ్చున‌ని త‌న తాత‌లు చెప్పేవార‌న్నారు.

Charminar-Golconda| ట‌న్నెల్‌పై హైద‌రాబాదీల్లో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు.. గుప్త నిధులుంటాయా?!

1936లో ట‌న్నెల్‌పై స‌ర్వే ఇలా

1962లో హైద‌రాబాద్‌లో స‌ర్వే జ‌రిపిన రిటైర్డ్‌ సెన్స‌స్ ఆప‌రేష‌న్స్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఖాజా మొయినుద్దీన్ ఈ ట‌న్నెల్ అంశం ప్ర‌స్తావించారు. 1936లో అప్ప‌టి హైద‌రాబాద్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఇనాయ‌త్ జంగ్‌, పురాత‌త్వ‌శాఖ డైరెక్ట‌ర్ గులాం యాజ్డానీలు ట‌న్నెల్ గురించి స‌వివ‌ర‌మైన స‌ర్వే జ‌రిపార‌ని ఖాజా మొయినుద్దీన్ పేర్కొన్నారు.

ఇలా ఏడ‌వ మీర్ ఉస్మాన్‌కు నివేదిక

వారు ట‌న్నెల్ మ్యాప్ త‌యారు చేయ‌డంతోపాటు దానికి సంబంధించిన నివేదిక‌ను అధికారికంగా అప్ప‌టి పాల‌కుడు నిజాం ఏడ‌వ మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు స‌మ‌ర్పించార‌ని తెలిపారు. చార్మినార్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రిపిన త‌వ్వ‌కాల్లో ట‌న్నెల్ ఉంద‌ని ఆ నివేదిక‌లో పేర్కొన్నారు. కానీ త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న విష‌య‌మై క్లారిటీ లేదు.

పీట్ల‌బుర్జు వ‌ద్ద పురాత‌న క‌ట్ట‌డం

‘కొన్నేండ్ల క్రితం పీట్ల బుర్జు వ‌ద్ద పురాత‌న క‌ట్ట‌డం ఉంద‌ని చ‌ర్చ సాగింది. కానీ దానికి ఎటువంటి ఆధారాల్లేవ‌ని పురాత‌త్వశాఖ అధికారులు తేల్చారు. అటుపై అదే ప్రాంతంలో పోలీస్ క్వార్ట‌ర్స్ నిర్మించారు’ అని సామాజిక కార్య‌క‌ర్త అహ్మ‌దీ బేగం చెప్పారు.

పుక్కిటి పురాణ‌మంటున్న చ‌రిత్ర‌కారులు

సైఫుల్లా అనే చ‌రిత్ర‌కారుడు మాత్రం చార్మినార్‌-గోల్కొండ ట‌న్నెల్ ఉనికి పూర్తిగా పుక్కిటి పురాణ‌మేన‌ని కొట్టి పారేశారు. ద‌క్క‌న్ పీఠ‌భూమి ప్రాంత‌మైన హైద‌రాబాద్‌లో పొడ‌వైన ట‌న్నెల్ నిర్మాణం అసాధ్యం అని అన్నారు. మ‌హ‌బూబ్ చౌక్ ప్రాంతంలో 4.5 ఎక‌రాల విస్తీర్ణంలో అండ‌ర్‌గ్రౌండ్ ప్యాలెస్ ఉండొచ్చున‌న్నారు.

ఇవి కూడా చదవండి:

క‌రోనా థ‌ర్డ్ వేవ్ త‌ప్ప‌దు.. అదీ త్వ‌ర‌లోనే: ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్‌

నార్కో టెర్ర‌ర్‌ను ఆపాలి: అమిత్ షా

క‌శ్మీర్‌ను లూటీ చేసేందుకే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు

నిబంధనలు పాటించని ఫలితం.. జన్‌పథ్‌ మార్కెట్‌ మూసివేత

ల‌ఢాక్‌లో చొర‌బ‌డిన చైనా సైనికులు.. ద‌లైలామా బ‌ర్త్‌డే వేడుకల‌పై నిర‌స‌న‌

అంత‌రిక్షం నుంచి భూమిని చూడ‌డం అద్భుతం: శిరీష బండ్ల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
Charminar-Golconda| ట‌న్నెల్‌పై హైద‌రాబాదీల్లో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు.. గుప్త నిధులుంటాయా?!
Charminar-Golconda| ట‌న్నెల్‌పై హైద‌రాబాదీల్లో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు.. గుప్త నిధులుంటాయా?!
Charminar-Golconda| ట‌న్నెల్‌పై హైద‌రాబాదీల్లో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు.. గుప్త నిధులుంటాయా?!

ట్రెండింగ్‌

Advertisement