ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jul 08, 2020 , 02:11:04

‘ఆరోగ్య సంజీవని’లో మార్పులు

‘ఆరోగ్య సంజీవని’లో మార్పులు

  • ఇక రూ.5 లక్షలపైనా బీమా: ఐఆర్‌డీఏఐ

న్యూఢిల్లీ, జూలై 7:  ‘ఆరోగ్య సంజీవని పాలసీ’ నిబంధనలను బీమా రంగ రెగ్యులేటర్‌ ఐఆర్‌డీఏఐ మంగళవారం సవరించింది. ఈ పాలసీలో లక్ష రూపాయల కంటే తక్కువ, రూ.5 లక్షల కంటే ఎక్కువ బీమాలకూ ఇన్సూరెన్స్‌ కంపెనీలను అనుమతించింది. ‘స్టాండర్డ్‌ ఇండివిడ్యువల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రోడక్ట్‌' మార్గదర్శకాల ప్రకారం జనరల్‌, హెల్త్‌ ఇన్సూరర్లు ఆరోగ్య సంజీవని పాలసీ కోసం కనీసం లక్ష రూపాయలు, గరిష్ఠంగా రూ.5 లక్షల బీమాలనే స్వీకరించాలి. అయితే సాధారణ ప్రజానీకం కోసం ఈ నిబంధనను మారుస్తున్నట్లు ఐఆర్‌డీఏఐ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ప్రజాదరణ పొందిన ఆరోగ్య సంజీవని పాలసీలో ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సకు, ఆస్పత్రిలో చేరడానికి ముందు, ఆ తర్వాత తీసుకునే వైద్యానికి, ఆయూష్‌ చికిత్స, కంటి వైద్యానికి అనుమతి ఉన్నది. 


logo