ఆదివారం 07 మార్చి 2021
Business - Feb 12, 2021 , 14:44:36

చందా కొచ్చర్‌కు బెయిల్‌.. దేశం విడిచి పోవద్దన్న కోర్టు

చందా కొచ్చర్‌కు బెయిల్‌.. దేశం విడిచి పోవద్దన్న కోర్టు

ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ చందా కొచ్చర్‌కు బెయిల్‌ మంజూరైంది. వీడియోకాన్‌ గ్రూప్‌నకు 2009-12 మధ్య రూ.3,250 కోట్ల రుణం మంజూరులో ఆమె లబ్ధిపొందినట్లు, ఆమె భర్త కంపెనీలో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో 2019లో సీబీఐ కేసు నమోదు చేయగా 2020లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌పై మనీలాండరింగ్ కింద కేసులు నమోదయ్యాయి. 2020 సెప్టెంబర్‌లో చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. 

మరోవైపు ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టు ఈ ఏడాది జనవరి 30న చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌, వీడియోకాన్‌ ప్రొమోటర్‌తోపాటు ఇతర నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బెయిల్‌ కోసం ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా చందా కొచ్చర్‌ పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈడీ స్పందన కోరిన కోర్టు రూ.5 లక్షల పూచికత్తుతో ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని పేర్కొంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo