శనివారం 31 అక్టోబర్ 2020
Business - Sep 25, 2020 , 06:56:36

దివాలా విచారణలపై మరో 3 నెలల సస్పెన్షన్‌

దివాలా విచారణలపై మరో 3 నెలల సస్పెన్షన్‌

న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం నేపథ్యంలో దివాలా చట్టం కింద కంపెనీలపై చేపట్టే కొత్త విచారణలపై సస్పెన్షన్‌ను కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ఈ విచారణలపై గతంలో విధించిన ఆరు నెలల సస్పెన్షన్‌ గురువారంతో ముగిసింది. దీంతో ఈ సస్పెన్షన్‌ను మరో మూడు నెలలు పొడిగించినట్టు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. దివాలా చట్టం కింద చేపట్టే కొత్త విచారణలపై గతంలో కేంద్రం విధించిన సస్పెన్షన్‌ లాక్‌డౌన్‌ ప్రారంభమైన మార్చి 25 నుంచే అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వం జూన్‌లో ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ స్థానంలో తీసుకొచ్చిన దివాలా చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌ ఇటీవల ఆమోదించింది. కరోనా సంక్షోభంతో సతమతమవుతున్న కంపెనీలకు ఊరట కల్పించేందుకు దివాలా చట్టంలోని 7, 9, 10 సెక్షన్లను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.