బుధవారం 28 అక్టోబర్ 2020
Business - Sep 11, 2020 , 00:12:14

ఎన్‌పీఏలుగా ప్రకటించవద్దు

ఎన్‌పీఏలుగా ప్రకటించవద్దు

  • మారటోరియం కేసులో
  • రుణ గ్రహీతలకు సుప్రీం ఊరట
  • ఈ నెల 28కి తదుపరి విచారణ వాయిదా
  • వడ్డీ మాఫీపై కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ

న్యూఢిల్లీ: మారటోరియం కేసులో రుణ గ్రహీతలకు సుప్రీం కోర్టు ఉపశమనం కలిగించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ఏ రుణాన్నీ మొండి బకాయి (ఎన్‌పీఏ)లుగా ప్రకటించవద్దని గురువారం స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును పొడిగించింది. ఫలితంగా మారటోరియం గడువు పెరిగినైట్లెంది. కాగా, కరోనా కారణంగా వచ్చిన మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ మాఫీ, వడ్డీపై వడ్డీ రద్దు అంశాన్ని పరిశీలించేందుకు మాజీ కాగ్‌ రాజీవ్‌ మెహ్రిషి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని కేంద్రం సుప్రీంకు ఈ సందర్భంగా తెలిపింది. రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకుంటామని, ప్రభుత్వం, ఆర్బీఐ సూచనలతో కూడిన అఫిడవిట్‌ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహెతా చెప్పారు. దీంతో ఈ నెల 28కి తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఇకపై ఈ కేసులో వాయిదాలుండవని పేర్కొన్న జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. ఇదే చివరి అవకాశమని తేల్చిచెప్పింది.


logo