గురువారం 21 జనవరి 2021
Business - Nov 02, 2020 , 16:43:52

రూ.6,000 కోట్ల జీఎస్టీ ప‌రిహారం విడుద‌ల

రూ.6,000 కోట్ల జీఎస్టీ ప‌రిహారం విడుద‌ల

న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు జీఎస్టీ ప‌రిహారం విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే మొద‌టి విడుత‌గా జీఎస్టీ ప‌రిహారం చెల్లించిన కేంద్రం.. తాజాగా రెండో విడుత‌గా మ‌రో రూ.6,000 కోట్ల‌ను విడుద‌ల చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. తాజాగా విడుద‌ల చేసిన నిధుల‌ను 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర‌పాలిత ప్రాంతాలకు అంద‌నున్నాయి. స్పెష‌ల్ విండో టు స్టేట్స్ ఫ‌ర్ మీటింగ్ ద జీఎస్టీ కంపెన్సేష‌న్ సెస్ షార్ట్‌ఫాల్ కింద కేంద్రం ఈ నిధుల‌ను విడుద‌ల చేసింద‌ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo