శుక్రవారం 03 జూలై 2020
Business - May 31, 2020 , 00:03:00

స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు

స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు

న్యూఢిల్లీ, మే 30: స్టార్టప్‌లకు ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నది. కరోనా వైరస్‌తో కుదేలైన స్టార్టప్‌లకు ఆర్థికంగా ఆదుకోవడానికి డీపీఐఐటీ, రెవెన్యూ శాఖలు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. స్టార్టప్‌లకు ఆర్థిక పరిహారం ఇచ్చేదానిపై రూపొందించిన నివేదికను డీపీఐఐటీ కార్యదర్శి గురుప్రసాద్‌ మహాపాత్ర ఇటీవల కేంద్ర క్యాబినెట్‌కు అందజేశారు. కుదేలైన స్టార్టప్‌లకు భారీగా రుణాలు ఇవ్వాలని ఆయన సూచించినట్లు తెలుస్తున్నది.ప్రస్తుతం ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించి సడలింపులు ఇచ్చేదానిపై రెవె న్యూ, స్టార్టప్‌ ఇండియాకు చెందిన అధికారులు ఆ దిశగా చర్చలు జరుపుతున్నారని మహాపాత్ర తెలిపారు. దేశవ్యాప్తంగా ఎలాంటి స్కీం లేకపోవడంతో సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు.


logo