ఈ-కామర్స్ ఎఫ్డీఐపై గురి

- నిబంధనల సవరణకు కేంద్రం కసరత్తు..
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు షాకులే
ఈ-కామర్స్ సంస్థలకు సంబంధించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సవరించడంపై కేంద్ర ప్రభుత్వ దృష్టి సారించింది. దీనిపై ఇప్పటికే చర్చలు మొదలైనట్లు అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి. ఇది కార్యరూపం దాలిస్తే అమెజాన్‌తోపాటు వాల్‌మార్ట్ ఆధీనంలోని ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్లైన్ వ్యాపార దిగ్గజ సంస్థలు కొంత మంది బడా అమ్మకందార్లతో నెరపుతున్న సంబంధాలను పునర్వ్యవస్థీకరించుకోవాల్సి ఉంటుంది.
న్యూఢిల్లీ, జనవరి 19: కేంద్ర ప్రభుత్వ నిబంధనలను పక్కదారి పట్టించేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు సంక్లిష్ట వ్యవస్థలను సృష్టిస్తున్నాయంటూ దేశంలోని రిటైల్ వర్తకుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థలకు సంబంధించిన ఎఫ్‌డీఐ నిబంధనలను సవరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి దేశంలోని కొనుగోలుదారులను, అమ్మకందారులను మార్కెట్‌కు అనుసంధానించి వ్యాపారాన్ని నిర్వహించేందుకు మాత్రమే విదేశీ ఈ-కామర్స్ సంస్థలను భారత్ అనుమతిస్తున్నది. అంతేతప్ప ఈ-కామర్స్ సంస్థలే నేరుగా తమ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వస్తువులను అమ్మేందుకు వీల్లేదు. ఈ విషయంలో కేంద్రం 2018 డిసెంబర్లోనే ఎఫ్‌డీఐ నిబంధనలను సవరించి విదేశీ ఈ-కామర్స్ సంస్థలకు షాకిచ్చింది. అమ్మకందార్లతో కుమ్మక్కై (వాటాలు పెట్టుకుని) వారి ఉత్పత్తులపై ఆఫర్లు ఇవ్వడాన్ని నిషేధించింది. అయినా ఇప్పటికీ అవి మాతృ సంస్థల ద్వారా అమ్మకందార్లతో పరోక్ష వాటాలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన మరికొన్ని నిబంధనలు సవరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
నెల క్రితమే అంతర్గత భేటీ
ఈ-కామర్స్ ఎఫ్‌డీఐ నిబంధనల సవరణకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తున్నట్లు ఆ శాఖ అధికార ప్రతినిధి యోగేష్ బజ్వా ధ్రువీకరించారు. ఈ సవరణలను త్వర లో ‘ప్రెస్ నోట్' ద్వారా ప్రకటిస్తామ న్నా రు. ఈ-కామర్స్ ఎఫ్‌డీఐ నిబంధనలను సవరించే ప్రక్రియ పురోగతిలో ఉన్నదని, ఇందుకు సంబంధించిన అంతర్గత సమావేశం నెల రోజుల క్రితమే జరిగిందని బజ్వా స్పష్టం చేశారు.
తాజావార్తలు
- క్రిప్టో కరెన్సీల్లో రికార్డు: బిట్ కాయిన్ 6% డౌన్.. ఎందుకో తెలుసా!
- చెన్నైలో ఈవీ చార్జింగ్ స్టేషన్.. టాటా పవర్+ఎంజీ మోటార్స్ జేవీ
- లీజు లేదా విక్రయానికి అంబాసిడర్ కంపెనీ!
- హార్టికల్చర్ విధాన రూపకల్పనకు సీఎం కేసీఆర్ ఆదేశం
- పల్లా గెలుపుతోనే సమస్యల పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో