బుధవారం 03 జూన్ 2020
Business - Apr 24, 2020 , 00:14:19

కార్పొరేట్లకు ఊరట

కార్పొరేట్లకు ఊరట

  • ఐబీసీ నిబంధనల్ని సవరిస్తున్న కేంద్రం
  • దివాలా ప్రక్రియకు ఏడాది బ్రేక్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: కార్పొరేట్‌ రుణగ్రహీతలకు గొప్ప ఊరటనిచ్చింది కేంద్ర ప్రభుత్వం. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో దివాలా చట్టం (ఐబీసీ) నిబంధనలను కేంద్రం సవరిస్తున్నది. ఏడాది వరకు ఈ చట్టం అమలును నిలుపుదల చేయాలని నిర్ణయించింది. దీంతో రుణ ఎగవేతదారులపై దివాలా ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డట్లే. కరోనా మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్‌ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న సంగతీ విదితమే. దీంతో వ్యాపార, పారిశ్రామిక రంగాలు స్తంభించిపోయాయి. ఈ పరిణామం రుణాల చెల్లింపులను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఐబీసీ నిబంధనల అమలును గరిష్ఠంగా ఏడాది వరకు ఆపేయాలని మోదీ సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగానే సెక్షన్‌ 7, 9, 10 నిబంధనలను 6 నెలలపాటు సస్పెండ్‌ చేయనున్నారు. దీన్ని ఏడాదిపాటు పొడిగించే అవకాశాలూ ఉన్నాయని సమాచారం. ఈ మేరకు కేంద్రం ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేయనుందని తెలుస్తున్నది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇందు కోసం నిర్ణయం కూడా తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.

రుణాల పునర్‌వ్యవస్థీకరణ

ఐబీసీ నిబంధనల సవరణతో కార్పొరేట్లకు బ్యాంకులు రుణాలను పునర్‌వ్యవస్థీకరించేందుకూ అవకాశం ఏర్పడింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం తీసుకున్న రుణాలకు సంబంధించిన కిస్తీలను 90 రోజులకు మించి చెల్లించకపోయినైట్లెతే సదరు రుణగ్రహీతలను రుణదాతలు దివాలా ప్రక్రియకు లాగవచ్చు. 


logo