బుధవారం 03 జూన్ 2020
Business - Apr 19, 2020 , 00:18:20

20 నుంచి సిమెంట్‌ ఉత్పత్తి?

20 నుంచి సిమెంట్‌ ఉత్పత్తి?

న్యూఢిల్లీ ఏప్రిల్‌ 18: లాక్‌డౌన్‌ కారణంగా సిమెంట్‌ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపేసిన అంబుజా, ఏసీసీ, ఐసీసీ, జేకే లక్ష్మీ సిమెంట్‌, ఇండియా సిమెంట్స్‌ సంస్థలు ఈ నెల 20 నుంచి దశలవారీగా తమ ఉత్పత్తిని పునఃప్రారంభించేందుకు ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాయి. కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం నిర్దేశించిన సామాజిక దూరాన్ని పాటిస్తూనే మళ్లీ ఉత్పత్తి మొదలుపెట్టనున్నట్టు ఆ సంస్థలు తెలిపాయి. ఇదేవిధంగా ఈ నెల 20 నుంచి తమ అన్ని శాఖలను తెరువనున్నట్టు ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థ ప్రకటించింది.


logo