శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Feb 14, 2021 , 02:11:38

సియట్‌ ప్రచారకర్తగా రానా

సియట్‌ ప్రచారకర్తగా రానా

ముంబై: టైర్ల తయారీ సంస్థ సియట్‌.. ప్రముఖ నటుడు రానా దగ్గుపాటిని ప్రచారకర్తగా నియమించుకున్నది. పంక్చర్‌ సేఫ్‌ విభాగ బైకు టైర్లకు దక్షిణాదిలో మరింత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో రానాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. రానా నటించిన కమర్షియల్‌ ప్రకటన తెలంగాణతోపాటు, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాల్లో ప్రచారం చేయనున్నది.

ఒలెక్ట్రా ఆదాయం 63 కోట్లు

తెలంగాణకు చెందిన ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలలకాలంలో స్టాండలోన్‌ ప్రాతిపదికన గతేడాది రూ.113 కోట్లు ఉండగా, ఈసారి రూ.62.76 కోట్లకు పడిపోయింది. నికర లాభం కూడా రూ.4.82 కోట్ల నుంచి రూ.4.57 కోట్లకు పడిపోయినట్లు బీఎస్‌ఈకి తెలిపింది.

VIDEOS

logo