శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Feb 23, 2021 , 00:33:26

ఇక సియ‌ట్ మ‌హిళా స‌ర్వీస్ సెంట‌ర్లు.. భాటిండాతో మొద‌లు

ఇక సియ‌ట్ మ‌హిళా స‌ర్వీస్ సెంట‌ర్లు.. భాటిండాతో మొద‌లు

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారితో అంత‌ర్జాతీయంగా త‌లెత్తిన సంక్షోభం వ‌ల్ల ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కానీ దేశీయ టైర్ల దిగ్గ‌జం సియ‌ట్‌.. స‌రికొత్త ఇన్షియేటివ్ తీసుకుంది. మ‌హిళ‌ల‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించింది. మ‌రింత మంది మ‌హిళ‌ల‌కు ఉపాధి క‌ల్పించేందుకు సిద్ధం అవుతోంది. పూర్తిగా మ‌హిళా సిబ్బందితో న‌డిచే క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ సెంట‌ర్ల‌ను ప్రారంభిస్తున్న‌ట్లు సోమ‌వారం ప్ర‌క‌టించింది.

పంజాబ్‌లోని భాటిండాలో పూర్తిగా మ‌హిళ‌లు నిర్వ‌హించే క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ సెంట‌ర్ల‌ను తెరుస్తున్న‌ట్లు సియ‌ట్ తెలిపింది. వ‌చ్చే కొన్ని నెల‌ల్లో పాన్ ఇండియా అంత‌టా మ‌హిళా సిబ్బందితోనే న‌డిచే క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ సెంట‌ర్ల‌ను తెరువ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. అన్ని ర‌కాల స‌ర్వీస్ అనుబంధ సేవ‌ల‌ను పూర్తిగా మ‌హిళా సిబ్బందే ఈ కేంద్రాల్లో అందిస్తారు. వీల్ చేంజింగ్‌, బ్యాలెన్సింగ్‌, వివిధ వాహ‌నాల మిష‌న‌రీల ఆప‌రేష‌న్ మ‌హిళా సిబ్బందే చూసుకుంటారు. 

తొలుత భాటిండాలో షాప్ ప్రారంభించి.. ఉత్త‌ర భార‌తావ‌నిలో 10 షాపుల‌ను తెరుస్తున్న‌ది. త‌మ ఉత్పాద‌క యూనిట్ల‌లో అన్ని విభాగాల్లో పురుషుల‌తోపాటు మ‌హిళ‌ల‌కు స‌మాన అవ‌కాశాలు క‌ల్పించాల‌ని నిర్ణ‌యించామ‌ని సియ‌ట్ తెలిపింది. షాప్‌ల నిర్వ‌హ‌ణ మొద‌లు ఇంజినీర్లు, నాయ‌క‌త్వ పాత్ర వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తామ‌ని తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo