గురువారం 03 డిసెంబర్ 2020
Business - Nov 21, 2020 , 00:43:01

రిలయన్స్‌ ఫ్యూచర్‌ డీల్‌కు సీసీఐ ఓకే

రిలయన్స్‌ ఫ్యూచర్‌ డీల్‌కు సీసీఐ ఓకే

న్యూఢిల్లీ: కిశోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ గ్రూపునకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాల కొనుగోలుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రతిపాదించిన డీల్‌ను కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదించింది. ఆర్‌ఐఎల్‌ తన రిటైల్‌ వ్యాపారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఈ ఏడాది ఆగస్టులో రూ.24,713 కోట్లకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. కానీ ఈ డీల్‌ను ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యతిరేకించడంతో ఈ డీల్‌పై సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ ప్యానల్‌ ఇటీవల తాత్కాలిక స్టే విధించింది. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ ఫ్యూచర్‌ డీల్‌ను సీసీఐ ఆమోదించడం గమనార్హం.