శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Jan 12, 2020 , 01:25:36

పారదర్శకత లోపిస్తే కఠినచర్యలే

పారదర్శకత లోపిస్తే కఠినచర్యలే

న్యూఢిల్లీ, జనవరి 11: వ్యాపార కార్యకలాపాల్లో పారదర్శకతలేని విధానాలు, పద్ధతులను పాటించే ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థలపై దర్యాప్తు జరిపించి కఠిన చర్యలు చేపడతామని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) హెచ్చరించింది. వస్తు, సేవల కోసం వినియోగదారులు జరిపే శోధనను ఆధారంగా చేసుకొని వాటికి ఈ-కామర్స్‌ సంస్థలు ఏవిధంగా ర్యాంకులిస్తాయని సీసీఐ చైర్మన్‌ అశోక్‌కుమార్‌ గుప్తా నిలదీశారు. వస్తు, సేవల విక్రయాల కోసం ఈ-కామర్స్‌ సంస్థలు ప్రత్యేకమైన పొత్తులు (ఎక్స్‌క్లూజివ్‌ టైఅప్స్‌) పెట్టుకోవడం, కొత్త మోడళ్ల మొబైల్‌ఫోన్ల లాంటి ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని ఆయన గతవారం తన నివేదికలో పేర్కొన్నారు.

మార్కెట్లో పోటీని దెబ్బతీసే ఆన్‌లైన్‌ విధానాలకు స్వచ్ఛందంగా స్వస్తిపలుకని ఈ-కామర్స్‌ సంస్థలు కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో విక్రయిస్తున్న మొత్తం మొబైల్‌ఫోన్లలో దాదాపు 45 శాతం ఆన్‌లైన్‌ ద్వారానే అమ్ముడవుతున్నాయని, దీనివల్ల తమకు జరుగుతున్న నష్టాన్ని అరికట్టాలని కోరుతూ రిటైల్‌ వ్యాపారుల సంఘం ఇప్పటికే సీసీఐ ఎదుట పిటిషన్‌ దాఖలు చేసిందని గుప్తా తెలిపారు.


logo