ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Jan 10, 2021 , 02:44:47

కోస్టల్‌ ప్రాజెక్టుపై సీబీఐ కేసు

కోస్టల్‌ ప్రాజెక్టుపై సీబీఐ కేసు

  • రూ.4,736 కోట్ల బ్యాంక్‌ మోసం 

న్యూఢిల్లీ, జనవరి 9: హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న కోస్టల్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌పై సీబీఐ కేసు దాఖలు చేసింది. రూ.4,736 కోట్ల బ్యాంకు మోసం కేసులో సంస్థతోపాటు డైరెక్టర్లపై కూడా కేసును నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదుతో 2013 నుంచి 2018 మధ్యకాలంలో కంపెనీ అకౌంట్‌ బుక్కులు, ఆర్థిక స్టేట్‌మెంట్లు, బ్యాంక్‌ గ్యారెంటీలపై తప్పుడు సమాచారం ఇచ్చిందని, దీంతో వీరిపై కేసును దాఖలు చేసినట్లు సీబీఐ ప్రతినిధి ఆర్‌సీ జోషి తెలిపారు. ఈ నిర్మాణ సంస్థలో ప్రమోటర్ల కంట్రిబ్యూషన్‌కు సంబంధించిన సమాచారాన్ని తప్పుగా ఉందని, బ్యాంకు రుణాలను వారి కుటుంబసభ్యులకు సంబంధించిన సంస్థలకు బదలాయించినట్లు తేలిందని ఆయన వెల్లడించారు. ఎస్బీఐ కన్సార్టియం వద్ద తీసుకున్న ఈ రుణం అక్టోబర్‌ 28, 2013 నుంచే నిరర్థక ఆస్తిగా పరిగణిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 20న మోసం చేసిన కేసుగా దాఖలు చేశారు. హైదరాబాద్‌, విజయవాడ కంపెనీ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో కీలక పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకున్నది.

VIDEOS

logo