ఆదివారం 31 మే 2020
Business - Apr 19, 2020 , 00:36:37

కోయిరీ ఓరెమిన్‌ లిమిటెడ్‌పై సీబీఐ కేసు నమోదు

కోయిరీ ఓరెమిన్‌ లిమిటెడ్‌పై సీబీఐ కేసు నమోదు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తప్పుడు సమాచారం ఇవ్వడంతోపాటు వ్యాపార నిమిత్తం తీసుకున్న రుణాన్ని దుర్వినియోగం చేసిన ఆరోపణలపై కోయిరీ ఓరెమిన్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. దశలవారీగా తమ వద్ద నుంచి పొందిన రూ.43.44 కోట్ల రుణం చెల్లించడం లేదంటూ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఖైరతాబాద్‌ బ్రాంచ్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. కంపెనీ డైరెక్టర్లు ఇషూ నారంగ్‌, చందూలాల్‌ పటేల్‌, రుద్రరాజ్‌ శ్రీనివాస్‌ షాపై కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు సమాచారం.


logo