మంగళవారం 26 మే 2020
Business - May 19, 2020 , 17:26:22

ప్రీఓన్డ్‌ బైక్‌ అమ్మకాల్లోకి కార్స్‌24

ప్రీఓన్డ్‌ బైక్‌ అమ్మకాల్లోకి కార్స్‌24

న్యూఢిల్లీ: ఇప్పటివరకు సెకండ్‌ హ్యాండ్‌ కార్ల కొనుగోలు, అమ్మకాల్లో ముందు వరుసలో నిలిచిన కార్స్‌ 24.. ఇకపై ప్రీ ఓన్‌డ్‌ బైకుల అమ్మకాలను చేపట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంగళవారం గుర్గావ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సంస్థ కో ఫౌండర్‌ గజేంద్ర జంగిడ్‌ వెల్లడించారు. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలను ప్రారంభించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా క్యాబ్‌ సర్వీసుల్లో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఉద్యోగులు నిరాసక్తి చూపుతుండటంతో తమ ప్రీ ఓన్డ్‌ బైక్‌ సేల్స్‌లో గుణాత్మక మార్పు వస్తుందని భావిస్తున్నట్టు గజేంద్ర జంగిడ్‌ చెప్పారు. దేశవ్యాప్తంగా 210 ప్లస్‌ శాఖలను కలిగివున్న కార్స్‌ 24.. మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగదారులకు నమ్మకం, పారదర్శకతను అందిస్తున్నదని ఆయన తెలిపారు. ప్రీఓన్డ్‌ బైక్‌ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు రానున్న ఆరు నెలల్లో 15 పట్టణాల్లో మరో 50 శాఖలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకొంటున్నామని ఆయన వెల్లడించారు.


logo