న్యూఢిల్లీ, జూలై 27: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ లాభాలు అదరహో అనిపించాయి. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో గత త్రైమాసికంలో నికర లాభంలో మూడింతల వృద్ధి నమోదైంది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.1,177.47 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.406.24 కోట్లుగా ఉన్నది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.21,210.06 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 8.50 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 3.46 శాతానికి దిగొచ్చింది.