శనివారం 08 ఆగస్టు 2020
Business - Jul 07, 2020 , 00:32:40

ఎంసీఎల్‌ఆర్‌ కోతలు

ఎంసీఎల్‌ఆర్‌ కోతలు

ముంబై: కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర తమ మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేట్ల (ఎంసీఎల్‌ఆర్‌)ను 20 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించాయి. కెనరా బ్యాంక్‌ ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 7.65 శాతం నుంచి 7.55 శాతానికి దిగిరాగా, బీవోఎం ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 7.70 శాతం నుంచి 7.50 శాతానికి తగ్గింది. నెలసరి, త్రైమాసిక ఎంసీఎల్‌ఆర్‌లకూ కోత పెట్టాయి.logo