సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Mar 21, 2020 , 23:30:07

ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీల కోసం రూ.48వేల కోట్లు ప్రకటించిన కేంద్రం

ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీల కోసం రూ.48వేల కోట్లు  ప్రకటించిన కేంద్రం

-క్యాబినెట్‌ భేటీలో నిర్ణయం

న్యూఢిల్లీ, మార్చి 21: ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. దాదాపు రూ.48వేల కోట్ల విలువైన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలకు మోదీ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. శనివారం ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. అనంతరం అందు లో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ విలేకరులకు తెలియజేశారు. ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీకి ఊతమివ్వడానికి రూ.40,995 కోట్ల ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు చెప్పారు. రాబో యే ఐదేండ్లలో ఈ మేరకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. సంస్థల అమ్మకాలు పెరిగేలా, పెట్టుబడులు పుంజుకునేలా ఈ ప్రోత్సాహకాలు ఉంటాయని వివరించారు. తమ ఈ నిర్ణయంతో 2025 కల్లా తయారీ రంగ ఆదాయ సామ ర్థ్యం రూ.10 లక్షల కోట్లకు చేరవచ్చన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 లక్షల మందికి ఉపాధి లభించగలదని అన్నారు. కొత్త కోణా ల్లో ఎలక్ట్రానిక్స్‌ తయారీ హబ్‌గా భారత్‌ను మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్ల కోసం రూ. 3,762.25 కోట్ల ప్రోత్సా హకాలకు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 


వైద్య పరికరాల కోసం..

కరోనా వైరస్‌ నేపథ్యంలో మెడికల్‌ డివైజ్‌ల తయారీని దేశీయంగా ప్రోత్సహించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ. 13,760 కోట్ల ప్యాకేజీని ప్రకటించగా, క్యాబినెట్‌ దీనికి ఆమోదం తెలిపింది. రూ.400 కోట్లతో మెడికల్‌ డివైజ్‌ పార్కుల పథకాన్ని కూడా తెస్తున్నది. తద్వారా రాబోయే ఐదేండ్లలో అదనంగా దాదాపు 34వేల ఉద్యోగాలను సృష్టించగలమని, మెడికల్‌ డివైజ్‌ల దిగుమతులనూ తగ్గిస్తామని ప్రసాద్‌ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రోత్సాహకాలు పెట్టుబడు లకు ఊతమిస్తాయని ఎలక్ట్రానిక్‌ తయారీదార్ల సంఘం కొనియాడిం ది. మరోవైపు సీసీఐ, మహారాష్ట్ర స్టేట్‌ కో-ఆపరేటివ్‌ కాటన్‌ గ్రోవర్స్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ల నష్టాల భర్తీకి రూ.1,061 కోట్లను ఇస్తున్నారు.


logo