డీబీఎస్‌లో లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీనానికి కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)ను డీబీఎస్ ఇండియాలో విలీనం చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. డిపాజిటర్లు, ప్రజలు, ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను కాపాడుతూనే బ్యాంకింగ్ వ్యవస్థను క్లీన్‌గా ఉంచడానికే ఇంత వేగంగా లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీనాన్ని పూర్తి చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఈ విలీనంతో ఇక డిపాజిటర్లకు నగదు ఉపసంహరణపై ఎలాంటి పరిమితులు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. ఈ విలీనంలో భాగంగా ఎల్‌వీబీలోకి డీబీఎస్ ఇండియా 2500 కోట్ల క్యాపిటల్‌ను సమకూర్చనుంది. లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను డీబీఎస్ ఇండియాలో విలీనం చేయాలని నవంబర్ 17న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. బ్యాంక్ మరింత సంక్షోభంలోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒక నెల పాటు మారటోరియం విధించింది. నెలకు గరిష్ఠంగా రూ.25000 మాత్రమే నగదు ఉపసంహరించుకునే అవకాశం కల్పించింది. లక్ష్మీ విలాస్ బ్యాంక్ కొంత కాలంగా అప్పులు, పాలన సమస్యలతో సతమతమవుతోంది.
తాజావార్తలు
- 50 ఏండ్ల వితంతువుపై అత్యాచారం
- ఆరుగురు క్రికెటర్లకు ఆనంద్ మహీంద్ర బంపర్ గిఫ్ట్
- ఉత్తరాఖండ్‌లో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
- డీసీసీబీలను మరింత బలోపేతం చేయాలి : సీఎస్
- బడ్జెట్ 2021 : స్మార్ట్ఫోన్లు, ఏసీల ధరలకు రెక్కలు?
- కాంగ్రెస్ ర్యాలీపై జలఫిరంగుల ప్రయోగం.. వీడియో
- దేశానికి నాలుగు రాజధానులు ఉండాలి: బెంగాల్ సీఎం
- యువకుడి ఉసురు తీసిన టిక్‌టాక్ స్టంట్
- 24న భారత్-చైనా తొమ్మిదో రౌండ్ చర్చలు
- బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ దాడి..!