బుధవారం 03 మార్చి 2021
Business - Feb 13, 2021 , 18:21:45

అమ్మ‌కానికి డ్రాగన్‌ ‘టిక్‌టాక్‌’?!

అమ్మ‌కానికి డ్రాగన్‌ ‘టిక్‌టాక్‌’?!

టోక్యో: భార‌త‌దేశంలో త‌న అనుబంధ సంస్థ టిక్‌టాక్ లావాదేవీల‌ను ప్ర‌త్య‌ర్థి యాప్ సంస్థ గ్లాన్స్‌కు విక్ర‌యించే అవ‌కాశాల‌ను డ్రాగ‌న్ టెక్ దిగ్గ‌జ సంస్థ బైట్ డ్యాన్స్ ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ విష‌య‌మై జ‌పాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేష‌న్ ప్రాథ‌మిక చ‌ర్చ‌లను ప్రారంభించింద‌ని వార్త‌లొచ్చాయి. అయితే, దీనిపై స్పందించ‌డం ఇప్పటికిప్పుడు తొంద‌ర‌పాట‌వుతుంద‌ని ఆ సంస్థ అధికార వ‌ర్గాలు తెలిపాయి. 

గ్లాన్స్ పేరెంట్ సంస్థ మొబైల్ అడ్వ‌టైజింగ్ టెక్నాల‌జీ సంస్థ ఇన్‌మొబి సొంతంగా షార్ట్ వీడియో యాప్ రొపొసోను క‌లిగి ఉంది. గ‌తేడాది టిక్‌టాక్‌పై భార‌త ప్ర‌భుత్వం నిషేధం విధించిన త‌ర్వాత రొపోసో యాప్‌కు పాపులారిటీ పెరిగింది. ఇన్‌మొబి అనుబంధ షార్ట్ వీడియో యాప్ రొపోసో, బైట్‌డ్యాన్స్ యాప్ టిక్‌టాక్ యాప్‌ల‌కు సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ తెర వెనుక మ‌ద్ద‌తు అందిస్తోంది. రొపోసో యాప్‌కు టిక్‌టాక్ భార‌త్ కార్య‌క‌లాపాల‌ను విక్ర‌యించే అంశంపై సాఫ్ట్ బ్యాంక్‌, బైట్‌డ్యాన్స్‌, ఇన్‌మొబి సంస్థ‌లు స్పందించ‌లేదు. 

శాశ్వ‌తంగా టిక్‌టాక్ యాప్‌పై భార‌త్ నిషేధం విధించ‌నున్న‌ట్లు పేర్కొన‌డంతో భార‌త్‌లో కార్య‌క‌లాపాల కొన‌సాగింపున‌కు గ్యారంటీ ఇవ్వ‌లేమంటూ గ‌త నెల‌లో ఇండియా టిక్‌టాక్ టీమ్‌లో 2000 మందికి పైగా ఉద్యోగుల‌ను తొల‌గించివేసింది. అంత‌కుముందే టిక్‌టాక్‌తోపాటు 58 ఇత‌ర చైనా యాప్‌ల‌పై నిషేధం కొన‌సాగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo