e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home బిజినెస్ కారెక్కేద్దాం పదండి

కారెక్కేద్దాం పదండి

కారెక్కేద్దాం పదండి
  • మహీంద్రా సరికొత్త ఆఫర్లు
  • 90 రోజుల తర్వాతే ఈఎంఐ మొదలు

న్యూఢిల్లీ, జూన్‌ 2: మహీంద్రా అండ్‌ మహీంద్రా.. తమ కస్టమర్లకు బుధవారం సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. కరోనా ధాటికి కుదేలైన మార్కెట్‌లో తిరిగి ఉత్సాహం నెలకొనేలా పలు ఆకర్షణీయ పథకాలకు తెరతీసింది. ఇందులో భాగంగానే ‘ఇప్పుడు వాహనం సొంతం చేసుకోండి.. 90 రోజుల తర్వాత ఈఎంఐ చెల్లింపుల్ని మొదలు పెట్టండి’ అంటున్నది. ఈ కష్టకాలంలో కస్టమర్ల ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఈ ఆఫర్‌ను తెచ్చామని ఈ సందర్భంగా మహీంద్రా స్పష్టం చేసింది.

మహీంద్రా నయా ఆఫర్లివే..

  • ఈఎంఐ ప్రారంభం
  • ప్యాసింజర్‌ కార్లతోపాటు వాణిజ్య వాహన కొనుగోలుదారులకూ వర్తింపు
  • 7.55 శాతం వడ్డీరేటుకే వాహన రుణాలు, పూర్తి రుణ సౌకర్యానికీ అవకాశం
  • ముందస్తు రుణ ముగింపుపై చార్జీల్లేవ్‌, ఈఎంఐలపై క్యాష్‌బ్యాక్‌ సదుపాయం
  • ఆన్‌లైన్‌ వేదికగా వాహన కొనుగోళ్లకు వెసులుబాటు
  • ఆన్‌లైన్‌ బుకింగ్‌పై రూ.3వేల విలువైన యాక్ససరీస్‌ ఉచితం
  • ఆన్‌లైన్‌ లోన్‌ మంజూరుకు రూ.2వేల ప్రయోజనాలు
  • వద్దనుకుంటే ఈ మొత్తాలు ఈఎంఐల్లో సర్దుబాటు, రూ.3వేలదాకా క్యాష్‌బ్యాక్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కారెక్కేద్దాం పదండి

ట్రెండింగ్‌

Advertisement