ఆదివారం 24 జనవరి 2021
Business - Dec 02, 2020 , 18:08:27

ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయిన బర్గర్ కింగ్ ఇండియా ఐపీఓ

ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయిన బర్గర్ కింగ్ ఇండియా ఐపీఓ

బర్గర్ కింగ్ ఇండియా ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే అధిక సభ్యత్వాన్ని సంపాదించింది. బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగిసే బర్గర్‌ కింగ్‌ ఐపీఓ 1.84 సభ్యత్వం పొందింది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.59-60గా ఉన్నది. సంస్థేతర పెట్టుబడిదారుల వర్గానికి 19 శాతం సభ్యత్వం లభించగా.. రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారులకు కేటాయించిన భాగం మధ్యాహ్నం 2 గంటల వరకు స్టాక్ ఎక్స్ఛేంజీలతో లభించిన డాటా ప్రకారం 9.83 సార్లు చందా పొందింది. 

అమెరికాకు చెందిన బర్గర్ కింగ్ యొక్క భారత అనుబంధ సంస్థ రూ.810 కోట్ల పెట్టుబడులను వసూలు చేయడానికి ఐపీఓను జారీ చేశారు. ప్రమోటర్ ఎంటీటీ క్యూఎస్‌ఆర్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ ఐపీఓ ద్వారా ఆరు కోట్ల వరకు షేర్లను విక్రయించనున్నది. ప్రైస్ బ్యాండ్ ఎగువ భాగంలో అమ్మకం ద్వారా రూ.360 కోట్లు లభించనున్నాయి. ఈ చైన్‌ ప్రస్తుతం భారతదేశంలో 268 దుకాణాలను నిర్వహిస్తున్నది. వాటిలో ఎనిమిది ఫ్రాంచైజీలు.. ప్రధానంగా విమానాశ్రయాలలో ఉన్నాయి. మిగిలినవి కంపెనీ యాజమాన్యంలో ఉన్నాయి. అమెరికాకు చెందిన క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చైన్ బర్గర్ కింగ్ యొక్క భారతీయ విభాగం బర్గర్ కింగ్ ఇండియా మంగళవారం యాంకర్ పెట్టుబడిదారుల నుంచి రూ.364.5 కోట్లు వసూలు చేసింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo