శనివారం 15 ఆగస్టు 2020
Business - Jul 10, 2020 , 00:44:51

బఫెట్‌ విరాళం 22 వేల కోట్లు

 బఫెట్‌ విరాళం 22 వేల కోట్లు

న్యూయార్క్‌, జూలై 9: దాతృత్వంలో మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు బెర్క్‌షైర్‌ హాథవే చైర్మన్‌, సీఈవో వారెన్‌ బఫెట్‌. గేట్స్‌ ఫౌండేషన్‌, ఇంకో 4 కుటుంబ చారిటీలకు దాదాపు 2.9 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.22 వేల కోట్లు) విలువైన కంపెనీ షేర్లను బఫెట్‌ విరాళంగా ఇచ్చారు. 15.97 మిలియన్ల క్లాస్‌ బీ షేర్లను వార్షిక విరాళంగా ప్రకటించినట్లు బెర్క్‌షైర్‌ తెలిపింది. ఇందులో అధిక మొత్తం బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కే వెళ్లాయి. మిగతా షేర్లు చనిపోయిన బఫెట్‌ మొదటి భార్య పేరుతో ఉన్న చారిటీ, పిల్లలు హోవర్డ్‌, సుసాన్‌, పీటర్‌లు నిర్వహిస్తున్న చారిటీలకు చేరాయి.

 2006 నుంచి ఏటా బఫెట్‌ తన వాటాల్లో కొంత విరాళంగా ప్రకటిస్తున్నారు. వచ్చే నెల 30తో 90వ పడిలోకి అడుగుపెడుతున్న బఫెట్‌.. ఇప్పటిదాకా 37.4 బిలియన్‌ డాలర్లకుపైగా విలువైన షేర్లను వివిధ చారిటీలకు విరాళంగా ఇచ్చారు. బెర్క్‌షైర్‌లోని తన వాటాలో ఇది 48 శాతానికి సమానం. గతేడాది అత్యధికంగా 3.61 బిలియన్‌ డాలర్లను విరాళంగా ప్రకటించారు. ప్రస్తుతం బఫెట్‌ వద్ద 67.5 బిలియన్‌ డాలర్ల విలువైన 2,48,734 క్లాస్‌ ఏ షేర్లున్నాయి. 

తాజావార్తలు


logo