మొబైల్ యాప్‌లో బడ్జెట్

కరోనా నేపథ్యంలో తొలిసారి పత్రాల ముద్రణకు బ్రేక్
న్యూఢిల్లీ, జనవరి 23: కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి పేపర్‌లెస్ బడ్జెట్ పార్లమెంట్‌లోకి వస్తున్నది. సభ్యుల కోసం ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్'ను శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు. దీనిద్వారా 14 యూనియన్ బడ్జెట్ డాక్యుమెంట్ల పూర్తి వివరాల్లోకి వెళ్లవచ్చు. బడ్జెట్ ప్రకటన అనంతరం ఈ యాప్ అందుబాటులోకి వస్తుంది. కాగా, కొవిడ్-19 దృష్ట్యా ఎంపీలకు భౌతికంగా పత్రాల అందజేత శ్రేయస్కరం కాదన్న ఆలోచనతోనే తొలిసారి ఈ పేపర్‌లెస్ బడ్జెట్‌కు మోదీ సర్కారు సై అన్నది. 1947 నవంబర్ 26న దేశంలో తొలి బడ్జెట్‌ను ప్రకటించారు. అప్పట్నుంచి పార్లమెంట్ సభ్యులకు ఆర్థిక బిల్లు, కొత్త పన్నుల వివరాలు, నిర్ణయాలుసహా కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల సమాచారం మొత్తం పత్రాల రూపంలోనే అందిస్తూ వచ్చారు. కానీ కరోనాతో ఈ సంప్రదాయానికి బ్రేకులు పడ్డైట్లెంది.
బడ్జెట్ హల్వా వేడుక
ఏటా కేంద్ర బడ్జెట్‌కు ముందు నిర్వహించే హల్వా వేడుక శనివారం ఘనంగా జరిగింది. నిర్మలా సీతారామన్‌తోపాటు సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక శాఖ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. బడ్జెట్ ప్రతుల ముద్రణ మొదలైందన్న దానికి సంకేతంగా ఈ వేడుకను జరుపుతారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
- నవభారత నిర్మాణంలో యువత భాగం కావాలి: వెంకయ్య పిలుపు
- వీడియో : జపాన్ కేబినెట్ లో వింత శాఖ
- ‘మూడ్’మారుతోందా!: వచ్చే ఏడు 13.7 శాతం వృద్ధి సాధ్యమేనా?!
- సూరత్‌లో బీజేపీ కన్నా ఆప్‌కు ఎక్కువ ఓట్లు
- నూతన ఐటీ నిబంధనలు అమలైతే వాట్సాప్‌కు చిక్కులే!
- ఇంగ్లాండ్ 81 ఆలౌట్.. భారత్ టార్గెట్ 49
- కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
- ఎంటర్టైనింగ్గా 'షాదీ ముబారక్' ట్రైలర్
- ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతూ పడిపోబోయిన సీఎం మమత
- ఘట్కేసర్ ప్లైఒవర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి