మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 03, 2020 , T00:40

చిన్నోళ్లు బాగుండాలని.. బడ్జెట్‌లో ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం

చిన్నోళ్లు బాగుండాలని.. బడ్జెట్‌లో ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లకు ఈసారి బడ్జెట్‌లో గొప్ప ప్రోత్సాహం లభించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల సంక్షోభం తదితర కారణాలతో మనుగడే ప్రశ్నార్థకంగా మారిన ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్‌లకు నిర్మలమ్మ రికార్డు స్థాయిలో నిధులను కేటాయించారు. మునుపెన్నడూ లేనివిధంగా ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.7,572.20 కోట్లను ప్రకటించారు. స్టార్టప్‌లకూ గణనీయంగా రూ.1,054.97 కోట్లు అందించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను శనివారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లకు ఊరటనిస్తూ భారీగా నిధులను అందించారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈల కోసం పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 


logo
>>>>>>