శుక్రవారం 05 మార్చి 2021
Business - Jan 16, 2021 , 16:56:13

క్రైసిస్‌లో ఐటీ రాయితీలు సాధ్యమేనా?!

క్రైసిస్‌లో ఐటీ రాయితీలు సాధ్యమేనా?!

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో దెబ్బ‌తిన్న రంగాలతోపాటు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ పున‌రుత్తేజానికి చ‌ర్య‌లు తీసుకోవాల్సిన త‌రుణ‌మిది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన ప్ర‌వేశ‌పెట్టే 2021-22 ఆర్థిక సంవ‌త్స‌ర వార్షిక బ‌డ్జెట్ విష‌మ ప‌రీక్షగా నిలువ‌నున్న‌ది. ఈ ప‌రిస్థితుల్లో ఆర్థిక వ్య‌వ‌స్థ పున‌రుత్తేజంతోపాటు ప్ర‌జ‌ల వినియోగ డిమాండ్ పెంచ‌డానికి ఆదాయం ప‌న్నులో మిన‌హాయింపులు ఇస్తార‌ని అంచ‌నాల వ్య‌క్తం అవుతున్నాయి. 

రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపుల‌పై ఆశ‌లు

60 ఏండ్ల‌లోపు ప్ర‌జ‌ల‌కు రూ.2.5 ల‌క్ష‌ల నుంచి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్రాథ‌మికంగా ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితి పెంచుతార‌ని వార్త‌లొస్తున్నాయి. ఇంత‌కుముందు 2014లో మాత్ర‌మే ఐటీలో ప్రాథ‌మిక మిన‌హాయింపులు ఇచ్చారు. నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపుల‌పై కేంద్రం ఎటువంటి సంకేతాలివ్వ‌లేదు. 

స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ కింద రూ.50 వేల వ‌ర‌కు మిన‌హాయింపు పెంచ‌డం వ‌ల్ల మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల్లో వినియోగానికి నిక‌ర ఆదాయం అందుబాటులో ఉంటుంద‌ని వ‌దంతులు ఉన్నాయి. క‌రోనా అనంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం బారీగా ఆదాయం ప‌న్ను మిన‌హాయింపులు ఇచ్చేందుకు సాహ‌సించ‌క‌పోవ‌చ్చున‌ని ట్యాక్స్ ఎక్స్‌ప‌ర్ట్‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

చిన్న చిన్న మిన‌హాయింపుల‌కే ప‌రిమితం

దెబ్బ‌తిన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్ట‌డానికి ప‌లు ఉద్దీప‌న ప్యాకేజీల‌ను ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న రుణాలు భారీగా పెరగ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. కేంద్రం రెవెన్యూ వ‌సూళ్లపై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. ఇప్పుడిప్పుడే ప‌న్ను వ‌సూళ్లు మెరుగు ప‌డుతున్నాయి. 

కేంద్రం భారీగా సంస్థాగ‌త మార్పులు చేయ‌కుండానే ప‌న్ను వ‌సూళ్ల‌లో చిన్న మార్పులు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఐటీ చ‌ట్టం కింద ఇప్పుడు అమ‌ల‌వుతున్న హయ్య‌ర్ డిడ‌క్ష‌న్ ప‌రిమితుల‌ను పెంచే అవ‌కాశాలు లేక‌పోలేదు. క‌రోనా నేప‌థ్యంలో వ‌య‌స్సుతో అనుసంధానిస్తూ హ‌య్య‌ర్ హెల్త్‌కేర్ వ్య‌యానికి మిన‌హాయింపులు ఇవ్వ‌వ‌చ్చు.

రూ.ల‌క్ష వ‌ర‌కు హెల్త్ మిన‌హాయింపులు

కొవిడ్‌-19 న‌యం చేసుకోవ‌డానికి చేసిన ఖర్చుల‌ను ఐటీ చ‌ట్టం 80డీ సెక్ష‌న్ కింద మిన‌హాయింపుల‌కు అనుమ‌తించొచ్చు. ఈ సెక్ష‌న్ కింద రూ.25 వేల నుంచి రూ. ల‌క్ష వ‌ర‌కు మిన‌హాయింపులు ఉంటాయి. ఇక ప్ర‌భుత్వోద్యోగుల‌కు ఎల్టీసీ క్యాష్ వోచ‌ర్ స్కీమ్ త‌దిత‌ర బెనిఫిట్లు క‌ల్పించే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది. 

ఉన్న‌తాదాయ వ‌ర్గాల‌పై ప్ర‌భుత్వం కొవిడ్‌-19 సెస్ ‌విధించ‌నున్న‌ట్లు సంకేతాల‌నిచ్చింది. త‌ద్వారా క‌రోనా అంతానికి సామూహిక వ్యాక్సినేష‌న్‌కు అయ్యే అద‌న‌పు వ్య‌యాన్ని ఈ సెస్‌తో భ‌ర్తీ చేసుకునే వెసులుబాటు ఉంది. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్లో కొవిడ్ సెస్ అంశం తేల‌నున్న‌ది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo