స్టార్టప్స్‌కు ఊతం.. సింగిల్ పర్సన్ కంపెనీలకు ప్రోత్సాహం

న్యూఢిల్లీ: స్టార్టప్స్‌కు ఊతమిచ్చేందుకు సింగిల్ పర్సన్ కంపెనీల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలో వ్యాపారాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నదని బడ్జెట్ ప్రసంగంలో ఆమె చెప్పారు. ఒక వ్యక్తి నేరుగా కంపెనీని ఏర్పాటు చేసేందుకు వీలుగా కంపెనీల చట్టం 2013కు సవరణలు చేస్తామని ప్రతిపాదించారు. కంపెనీల ఏర్పాటుకు ప్రవేశ క్యాపిటలైజేషన్ గరిష్ఠ పరిమితిని రూ.50 లక్షల నుండి రూ.2 కోట్లకు, టర్నోవర్ గరిష్ఠ పరిమితిని రూ.2 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచుతామని వివరించారు.
దేశంలో కంపెనీలను స్థాపించడానికి రెసిడెన్సీ వ్యవధి 182 రోజుల నుండి 120 రోజులకు తగ్గిస్తామని నిర్మల చెప్పారు. తద్వారా ప్రవాస భారతీయులు దేశంలో ఒక వ్యక్తి సంస్థలను ఏర్పాటు చేయడానికి ఇది వీలు కల్పిస్తుందన్నారు.అలాగే స్టార్టప్‌లకు పన్ను సెలవుతో పాటు మూలధన లాభాల మినహాయింపును 2022 మార్చి 31 వరకు పొడిగించాలని ప్రతిపాదించారు. ఈ చర్యల వల్ల చిన్నకంపెనీల నిర్వచనం పూర్తిగా మారిపోతుందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- వ్యాపారుల కోసం రూపే సాఫ్ట్ పీఓఎస్
- రైడింగ్ మోడ్స్‌తో సరికొత్త అపాచీ
- సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా సమీర్ గోయల్
- మొక్కను తొలగించిన ఇద్దరికి జరిమానా
- టీవీ ధరలకు రెక్కలు!
- పంత్ పవర్
- ముత్తూట్ చైర్మన్ కన్నుమూత
- సెహ్వాగ్ 35 బంతుల్లో 80 నాటౌట్
- మంత్రి కొప్పులను కలిసిన గద్దర్
- ఈ-కొలి బ్యాక్టీరియాతో క్యాన్సర్..!